పారిశుధ్య కార్మికులపై వేధింపులు ఆపాలి

ABN , First Publish Date - 2021-12-08T05:23:45+05:30 IST

స్కూలు పారిశుధ్య కార్మికులపై రాజకీయ వేధింపులు ఆపాలని డిమాండ్‌ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో పారిశుధ్య కార్మికులు డిమాండ్‌ చేశారు.

పారిశుధ్య కార్మికులపై వేధింపులు ఆపాలి
వినతిపత్రం అందిస్తున్న పారిశుధ్య కార్మికులు


గిద్దలూరు, డిసెంబరు 7 : స్కూలు పారిశుధ్య కార్మికులపై రాజకీయ వేధింపులు ఆపాలని డిమాండ్‌ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో పారిశుధ్య కార్మికులు డిమాండ్‌ చేశారు. సీఐటీయూ నాయకులు నరసింహులు మాట్లాడుతూ దిగువమెట్ట గ్రామంలోని మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాలలో పని చేస్తున్న జ్యోతి అనే పారిశుధ్య కార్మికురాలిని తొలగించాలని గ్రామ వైసీపీ నాయకులు హెచ్‌ఎంపై ఒత్తిడి చేయడం శోచనీయమన్నారు.  మరికొన్ని పాఠశాలల పరిధిలో ఇలాంటి పరిస్థితే నెలకొన్నదని ఆందోళన వ్యక్తం చేశారు. రాజకీయ కారణాలతో ఏ ఒక్క కార్మికురాలిని తొలగించినా సహిం చేదిలేదన్నారు. పెండింగ్‌ వేతనాలను మంజూరు చేయాలని కోరారు. ఈ సం దర్భంగా స్కూలు పారిశుధ్య కార్మికుల సంఘం ప్రతినిధులు జహీరా, కృప మ్మ, సరస్వతి విద్యాశాఖ కార్యాలయ సిబ్బందికి వినతిపత్రం అందచేశారు.


Updated Date - 2021-12-08T05:23:45+05:30 IST