ఆ ఇంటి యువతికి ప్రేమపేరుతో వేధింపులు..ఊరికెళ్లి వచ్చేసరికి..

ABN , First Publish Date - 2021-10-27T16:01:48+05:30 IST

ఊరికెళ్లి వచ్చేసరికి ఇల్లు దహనమైందని జవహర్‌నగర్‌ పోలీస్టేషన్‌లో మంగళవారం కేసు నమోదైంది. అయితే ఆ ఇంటికి చెందిన యువతికి ఓ ఫుడ్‌ డెలివరీ బాయ్‌ వేధింపులకు

ఆ ఇంటి యువతికి ప్రేమపేరుతో వేధింపులు..ఊరికెళ్లి వచ్చేసరికి..

ఫుడ్‌ డెలివరీబాయ్‌పై అనుమానం

హైదరాబాద్/జవహర్‌నగర్‌: ఊరికెళ్లి వచ్చేసరికి ఇల్లు దహనమైందని జవహర్‌నగర్‌ పోలీస్టేషన్‌లో మంగళవారం కేసు నమోదైంది. అయితే ఆ ఇంటికి చెందిన  యువతికి ఓ ఫుడ్‌ డెలివరీ బాయ్‌ వేధింపులకు గురి చేస్తూ మీ ఇంటిని తగలబెడతానని బెదిరించినట్లు సమాచారం. సీఐ భిక్షపతి తెలిపిన వివరాల ప్రకారం..జవహర్‌నగర్‌ కార్పొరేషన్‌ పరిధిలోని బీజేఆర్‌నగర్‌ మల్లికార్జుననగర్‌లో యువతి కుటుంబ నివసిస్తోంది. అయితే అదే కాలనీకి చెందిన నవీన్‌ అనే ఫుడ్‌ డెలివరీ బాయ్‌ ప్రేమపేరుతో ఆమెను వేధిస్తున్నాడు.  వివాహం చేసుకోకుంటే వారి ఇంటిని తగలబెడతానని బెదిరింపులకు కూడా పాల్పడ్డాడు. కొద్దిరోజుల క్రితం ఆమెకు వివాహం నిశ్చయమైంది. నానమ్మకు అనారోగ్యం రీత్యా  ఈనెల 10న వారి స్వగ్రామానికి ఆమెతో సహా కుటుంబీకులు వెళ్లారు. తిరిగి శనివారం (ఈనెల 23న) రాగా ఇల్లు కాలిపోయి ఉంది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా, సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కిరోసిన్‌ పోసి తగలబెట్టినట్లు గుర్తించారు. నిందితుడు నవీన్‌గా అదుపులోకి తీసుకున్నారు. 

Updated Date - 2021-10-27T16:01:48+05:30 IST