ఆశ వర్కర్లపై వేధింపులు ఆపాలి

ABN , First Publish Date - 2022-06-25T04:44:07+05:30 IST

ఆశ వర్కర్ల పై పనిభారం తగ్గించి, అధికారుల వేధింపులు ఆపాలని ఆశ వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సునీత డిమాండ్‌ చేశారు.

ఆశ వర్కర్లపై వేధింపులు ఆపాలి
ఆశ వర్కర్‌ సుజాత మృతికి సంతాపం ప్రకటిస్తున్న జిల్లాలోని ఆశ వర్కర్లు

వనపర్తి వైద్యవిభాగం, జూన్‌ 24: ఆశ వర్కర్ల పై పనిభారం తగ్గించి, అధికారుల వేధింపులు ఆపాలని ఆశ వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సునీత డిమాండ్‌ చేశారు. హైదరాబాద్‌ లోని శాతవాహన మలక్‌పేట పీహెచ్‌సీలో పని చేస్తున్న ఆశ వర్కర్‌ సుజాత మృతికి నిరసనగా శుక్రవారం జిల్లా కేంద్రంలోని రాజీవ్‌ చౌరస్తాలో  నల్ల బాడ్జీలతో ఆశ వర్కర్లు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అధికారుల వేధింపులు, పని ఒత్తిడి కారణంగా సుజాత  ఈ నెల 22న హైదరాబాద్‌లో విధులు నిర్వహిస్తూనే మృతి చెందిందని ఆవేదన వ్యక్తం చేశారు. సుజాత కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలనే డిమాండ్‌తో శాంతియుతంగా ఆందోళన చేస్తున్న ఆశ వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షురాలు విజయలక్ష్మిని పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి నిర్భందించడాన్ని ఆమె తీవ్రంగా ఖండించారు. మృతి చెందిన సుజాత కుటుంబానికి రూ. 25 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించి, ముగ్గురు ఆడపిల్లల ను ప్రభుత్వమే  ఉన్నత చదువులు చదివించాల ని, భర్తకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.  అనంతరం సుజాత మృతికి సంతాపం గా మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు మండ్ల రాజు, గోపాలకృష్ణ, నందిమల్ల రాములు, రమేష్‌, ఆశ వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు బాలకిష్టమ్మ, రమాదేవి, భాగ్యమ్మ, నారాయణమ్మ, పార్వతి, శ్యామల, లీలావతి, శివమ్మ పాల్గొన్నారు. 

అమరచింతలో..

అమరచింత: ఆశవర్కర్లకు పనిభారం తగ్గిం చాలని డిమాండ్‌ చేస్తూ అమరచింత మండల కేంద్రంలోని దేశాయ్‌ మురళీధర్‌రెడ్డి మెమోరియ ల్‌ ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర సీఐటీయూ ఆధ్వ ర్యంలో శుక్రవారం ధర్నా చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి  రమేష్‌, ఆశ వర్కర్ల సంఘం జిల్లా నాయకురాలు శాం తమ్మ, ఆశవర్కర్లు సంధ్య, సుజాత, మేరీ, సునీత, అరుణ, జయరాణి తదితరులు పాల్గొన్నారు. 

కొత్తకోటలో..

కొత్తకోట : ఆశ కార్యకర్తలపై జరుగుతున్న వేధింపులకు నిరసనగా కొత్తకోటలో సీఐటీయూ ఆధ్వర్యంలో శుక్రవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆ సంఘ జిల్లా ఉపాధ్యక్షుడు నిక్సన్‌ మాట్లాడుతూ హైదారాబాద్‌ శాలివాహన నగర్‌ లో విధులు నిర్వహిస్తున్న ఆశ వర్కరు సుజాత పని ఒత్తిడి కారణంగానే అస్వస్థతకు గురై మృతి చెందారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మండల ఆశ వర్కర్లు మంజుల, అనసూయ, సంతోష, రజిత, రాణి, షకీరా, సుల్తానా, పుష్ప, రేణుక, చంద్రకళ, లక్ష్మి, శారద, ఇంద్రజ, గీత, అర్చన, భాగ్యమ్మ, ఇందిర, చిట్టెమ్మ ఉన్నారు.

పెద్దమందడిలో ..

పెద్దమందడి : హైదరాబాద్‌లో విధులు నిర్వ హిస్తూ ఆకస్మాత్తుగా మృతి చెందిన ఆశ కార్య కర్త కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని మం డల కేంద్రంలో ఆశ కార్యకర్తలు నల్లబ్యాడ్జిలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం మం డల కేంద్రంలోని గాంధీ చౌరస్తాలో నిరసన వ్యక్తం చేసి సుజాత కుటుంబానికి ప్రగాఢ సాను భూతి తెలిపారు.  కార్యక్రమంలో ఆశ వర్కర్ల జిల్లా ప్రధాన కార్యదర్శి గిరిజ,   వివిధ గ్రామాల ఆశ వర్కర్లు పాల్గొన్నారు.

 

Updated Date - 2022-06-25T04:44:07+05:30 IST