త్యాగధనులను స్మరించుకుందాం

ABN , First Publish Date - 2022-08-14T05:45:51+05:30 IST

దేశం కోసం ప్రాణాలర్పించిన త్యాగధను లను స్మరించుకుందామని ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు అన్నారు.

త్యాగధనులను స్మరించుకుందాం
తణుకులో పార్టీలకతీతంగా జాతీయ జెండాతో ర్యాలీ చేస్తున్న నాయకులు

ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు

ఘనంగా హర్‌ఘర్‌ తిరంగా ర్యాలీలు

ఆకట్టుకున్న విద్యార్థుల వేషధారణలు 


ఉండి/ఆకివీడు/ఆకివీడు రూరల్‌/పాలకోడేరు, ఆగస్టు, 13:దేశం కోసం ప్రాణాలర్పించిన త్యాగధను లను స్మరించుకుందామని ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు అన్నారు. శనివారం ఉండి మండలం ఎన్‌ఆర్‌పీ అగ్రహారంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ఆధ్వర్యంలో హర్‌ఘర్‌ తిరంగా కార్యక్రమం నిర్వహిం చారు. ఉండి దివ్య డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో వంద మీటర్ల జాతీయజెండాతో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ఆకివీడులో విద్యా వికాస్‌ కళాశాలలో వంద మీటర్ల జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించారు. రైస్‌ మిల్లర్స్‌ అసోసియేషన్‌ నేతృత్వంలో రైస్‌ మిల్లు కార్మికులకు కార్యదర్శి గొంట్లా సత్యనారాయణ జెండాలు అందజేశారు. ఆకివీడు మండలం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో టీడీపీ మండలాధ్యక్షుడు మోటుపల్లి రామవరప్రసాద్‌, గొంట్లా గణపతి, బొల్లా వెంకట్రావు, గంధం ఉమ, నౌకట్ల రామారావు, తదితరులు తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఆకివీడు మండలం చెరుకుమిల్లి గ్రామంలో మంతెన దుర్గరాజు జిల్లా పరిషత్‌ హైస్కూల్లో ఆధ్వర్యంలో వంద మీటర్ల జెండాతో తిరంగా ర్యాలీ నిర్వహించారు. పాలకోడేరు మండలం విస్సాకోడేరు సెయింట్‌ జాన్స్‌ ఇంగ్లీష్‌ మీడియం హైస్కూల్‌, గొరగనమూడిలో స్వామి జ్ఞానానంద జడ్పీ హైస్కూల్లో విద్యార్థులు తిరంగా ర్యాలీ నిర్వహించారు. 

భీమవరం ఎడ్యుకేషన్‌/భీమవరం టౌన్‌/వీరవాసరం, ఆగస్టు 13 : భీమవరం పట్టణంలో సాగి రామకృష్ణంరాజు మార్గ్‌లో సుమారు 50 మంది దేశభక్తుల చిత్రాలతో కూడి హోర్డింగ్స్‌ తన కళాశాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్నట్టు ఎస్‌ఆర్‌కేఆర్‌ ఇంజనీరింగ్‌ కళాశాల సెక్రటరీ ఎస్‌ఆర్‌కే నిశాంతవర్మ తెలిపారు. శనివారం కళాశాల సిబ్బంది, విద్యార్థులతో తిరంగా ర్యాలీ నిర్వహించారు. డీఎన్నార్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ టెక్నాలజీలో ఎన్‌ఎస్‌ఎస్‌ యూనిట్‌ వారి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. మునిసిపల్‌ ఇంగ్లీషు మీడియం స్కూల్‌, వెంప జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల, అభ్యాస్‌ ద గ్లోబల్‌ స్కూల్‌, కాకతీయ స్కూల్‌ ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీ నిర్వహించారు. భీమవరం బ్యాంకు కాలనీలో యూత్‌ హస్టల్‌ భీమవరం యూనిట్‌ ఆధ్వర్యంలో హర్‌ ఘర్‌ తిరంగా నిర్వహించారు. మల్లినీడి తిరుమలరావు ఆధ్వర్యంలో ప్రతీ ఇంటికి జెండాలను పంపిణీ చేశారు. వీరవాసరం తూర్పు చెరువు గట్టున ఉన్న చిలకమర్తి లక్ష్మీ నర్సింహం విగ్రహం వద్ద నివాళులు అర్పించారు. భారతి పబ్లిక్‌ స్కూల్‌, లిటిల్‌బడ్స్‌ స్కూల్‌, డిగ్రీ కళాశాల విధ్యార్ధులు చిలకమర్తికి నివాళులర్పించి నినాదాలు చేశారు. చిలకమర్తి వంశీకులు మత్స్యపురి గ్రామానికి చెందిన చిలకమర్తి సుబ్రహ్మణ్యం శాస్ర్తిని ఈ సందర్భంగా జడ్పీటీసీ సభ్యుడు గుండా జయప్రకాష్‌నాయుడు, గుండా రామకృష్ణ, సత్కరించారు. వీరవాసరంలో టీడీపీ, జనసేన నాయకులు, భారతి పబ్లిక్‌ స్కూల్‌, లిటిల్‌బడ్స్‌, డిగ్రీ కళాశాల విద్యార్థులతో బస్టాండ్‌ సెంటర్‌ నుంచి పంటకాలువ వరకు వంద అడుగుల జాతీయ పతాకంతో ర్యాలీ చేశారు. భారతమాత, జాతీయ నాయకుల వేషధారణలో ర్యాలీలో పాల్గొన్నారు. రాయకుదురు జడ్పీ హైస్కూల్‌ వద్ద, నవుడూరు జంక్షన్‌లో కేఎస్‌ఎన్‌ఆర్‌ జూనియర్‌ కళాశాల విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. 

పాలకొల్లు/పాలకొల్లు అర్బన్‌/యలమంచిలి : పాలకొల్లు పట్టణంలోని పలు కార్యక్రమాల్లో ఎమ్మెల్యే డాక్టర్‌ నిమ్మల రామానాయుడు పాల్గొన్నారు. క్షత్రియ కల్యాణ మండపంలో జరుగుతున్న యోగా అభ్యాసకులను కలిసి జాతీయ పతాకాలను. జూట్‌ బ్యాగ్‌లను పంపిణీ చేశారు. పాలకొల్లు ఏఎస్‌ఎన్‌ఎం ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు త్రివర్ణ పతాకాల తో భారత దేశ పటం మాదిరిగా నిలిచి దేశభక్తిని చాటుకున్నారు.  పాలకొల్లు రూరల్‌ లయన్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో బ్రాడీపేట నుంచి గాంధీబొమ్మల సెంటర్‌ వరకు మోటారు సైకిళ్ల ర్యాలీ నిర్వహిం చారు. భారతీయ విద్యాభవన్స్‌, గురుకుల వసతి గృహం, మాంటిస్సోరీ, ఆదిత్య స్కూల్‌, గౌతమి కళాశాల, చైతన్య, చాంబర్స్‌ కళాశాలలు తదితర విద్యాసంస్థల ఆధ్వర్యంలో ర్యాలీలు నిర్వహించారు. యలమంచిలిలో హైస్కూల్‌ విద్యార్థులు ఎంపీపీ రావూరి వెంకట రమణ ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీ నిర్వహించారు. బ్రహ్మ కుమారీస్‌ సంస్థ ఆధ్వర్యంలో హర్‌ఘర్‌ తిరంగా కార్యక్రమం నిర్వహించారు. 

నరసాపురం టౌన్‌/మొగల్తూరు, ఆగస్టు 13: నరసాపురం పట్టణంలోని గౌతమి కళాశాల ఆధ్వర్యంలో హర్‌ఘర్‌ తిరంగా ర్యాలీ నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ప్రభుత్వ చీఫ్‌ విప్‌ ముదునూరి ప్రసాద రాజు విచ్చేశారు. కరస్పాండెంట్‌ చినమిల్లి దుర్గప్రసాద్‌, చైర్‌పర్సన్‌ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. రాయపేట పుంతలో ముసలమ్మ అమ్మవారి ఆలయానికి 210 అడుగుల జాతీయ జెండాను ఆలయం చుట్టూ ఏర్పాటు చేశారు. మొగల్తూరులో ప్రతిభ, సూర్య, గౌతమి పాఠశాలల విద్యార్థులు, కాళీపట్నంలో గాయత్రీ పబ్లిక్‌ స్కూల్‌ ఆధ్వర్యంలో సుమారు 200 అడుగుల జాతీయ జెండాతో ప్రదర్శన నిర్వహించారు.  

ఆచంట/పెనుగొండ, ఆగస్టు 13 :  ఆచంటలో మెయిన్‌ పాఠశాల, భవిత కేంద్రం ఆధ్వర్యంలో హర్‌ఘర్‌ తిరంగా ర్యాలీలు నిర్వహించారు.  పెనుగొండలో ఎస్‌వీకేపీ అండ్‌ డాక్టర్‌ కేఎస్‌ రాజు ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాలలో ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ వైవీవీ అప్పారావు అధ్యక్షతన, శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి, పితాని వెంకన్న జూనియర్‌ కళాశాలలో ప్రిన్సిపాల్‌ కేవీఆర్‌ సూర్యనారాయణ ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీలు నిర్వహించారు. భాష్యం, ఆక్స్‌ఫర్డ్‌, చైతన్య పాఠశాలలు, లయన్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో గ్రామంలో ర్యాలీలు నిర్వహించారు.  

ఫ తణుకు/ఇరగవరం, ఆగస్టు 13: తణుకు రాష్ట్రపతి రోడ్డులో జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ, వావిలా ల సరళాదేవి,  జనసేన నాయకుడు విడివాడ రామచంద్రరావు, బీజేపీ నా యకుడు మల్లిన రాధాకృష్ణ, రెల్లు రాయుడు యూత్‌ తదితరులు పాల్గొ న్నారు. తేతలి జడ్పీ హైస్కూలు విద్యా ర్థులు  75 సంఖ్య ఆకారంలో కూర్చుని వినూత్న ప్రదర్శన నిర్వహించారు. ఇరగవరం మండలం రేలంగిలో ర్యాలీ ని రేలంగి గ్రామస్థులు నిర్వహించారు.  ర్యాలీని సర్పంచ్‌ చేబ్రోలు స్వరాజ్యం జెండా ఊపి ప్రారంభించారు. 

తాడేపల్లిగూడెం రూరల్‌, ఆగస్టు 13: నవాబుపాలెం ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులు 75 అంకె ఆకృతిలో నిలిచి నినాదాలు చేశారు.  హెచ్‌ఎం పుష్పరాజ్‌, టీచర్లు పాల్గొ న్నారు. పట్టణంలోని 5వ వార్డు సచివాలయం అడ్మిన్‌ బంగార్రాజు ఆధ్వర్యంలో వాణి పబ్లిక్‌ స్కూల్‌ విద్యార్థులు  ర్యాలీ నిర్వహించారు.  



Updated Date - 2022-08-14T05:45:51+05:30 IST