ప్రతీ ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలి

ABN , First Publish Date - 2022-08-13T05:45:09+05:30 IST

దేశ సమైక్యత, సమగ్రతను చాటిచెప్పేలా ప్రతీ ఒక్కరిలో జాతీయతా భావన కలగాలని, ప్రతీ ఇంటిపై జాతీయ పతాకం ఎగరాలని జిల్లా కలెక్టర్‌ ప్రశాంతి అన్నారు.

ప్రతీ ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలి
భీమవరం విష్ణు కాలేజీలో ర్యాలీని ప్రారంభిస్తున్న కలెక్టర్‌ ప్రశాంతి, ఎమ్మెల్యే శ్రీనివాస్‌

జిల్లా కలెక్టర్‌ ప్రశాంతి 

ఘనంగా హర్‌ ఘర్‌ తిరంగా ర్యాలీలు 


భీమవరం ఎడ్యుకేషన్‌/వీరవాసరం/కాళ్ల/పాలకోడేరు/నరసాపురం టౌన్‌/ భీమవరం టౌన్‌/పాలకొల్లు టౌన్‌/ఉండి, ఆగస్టు 12 : దేశ సమైక్యత, సమగ్రతను చాటిచెప్పేలా ప్రతీ ఒక్కరిలో జాతీయతా భావన కలగాలని, ప్రతీ ఇంటిపై జాతీయ పతాకం ఎగరాలని జిల్లా కలెక్టర్‌ ప్రశాంతి అన్నారు. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ను పురస్కరించుకుని ‘హర్‌ ఘర్‌ తిరంగా’ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం భీమవరం పట్టణంలోని శ్రీవిష్ణు విద్యా సంస్థలు నిర్వహించిన 150 మీటర్ల జాతీయ జెండా ర్యాలీని కలెక్టరు ప్రశాంతి, ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌ ప్రారంభించారు. ఈనెల 13, 14, 15 తేదీలలో ప్రతీ ఇంటా జాతీయ జెండా ఎగురవేసి దేశభక్తిని చాటుకోవాలన్నారు. ర్యాలీలో ఆర్డీవో దాసి రాజు, పురపాలక సంఘం కమిషనర్‌ ఎస్‌.శివరామకృష్ణ, తహసీల్దార్‌ వై.రవికుమార్‌, ఎంపీడీవో జి.పద్మ, పలు శాఖల అధికారులు, పట్టణ ప్రముఖులు విష్ణు కాలేజీ అధ్యాపకులు, సిబ్బంది, పలు సేవా సంస్థలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. భీమవరం భాష్యం స్కూల్లో విద్యార్థులు జాతీయ జెండాలతో ర్యాలీ నిర్వహించారు. ప్రిన్సిపాల్‌ జగన్‌మోహన్‌, లిటిల్‌ చాంప్‌ ప్రిన్సిపాల్‌ రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. వీరవాసరం మండలం నందమూరుగరువు నుంచి వీరవాసరం వరకు  ఎంఆర్‌కే జడ్పీహైస్కూల్‌, లిటిల్‌బడ్స్‌, భారతి, డివైన్‌మెర్సీ హైస్కూల్‌ విద్యార్థులు జాతీయ పతాకంతో ర్యాలీ నిర్వహించారు. కాళ్ల మండలం జక్కరం ప్రాథమిక పాఠశాల, కోపల్లె హైస్కూల్లో ఎస్‌ఆర్‌కేఆర్‌ ఇంజనీరింగ్‌ కళాశాల ఆధ్వర్యంలో హర్‌ ఘర్‌ తిరంగా ర్యాలీ నిర్వహించారు. కళాశాల కోఆర్డినేటర్లు జీవన్‌కుమార్‌, రాంబాబులు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. పాలకోడేరు మండలం పెన్నాడ భీమవరం ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ టెక్నాలజీలో శుక్రవారం విద్యార్థులకు రంగోలి పోటీలు నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ కొప్పర్తి సురేష్‌ తెలిపారు. విద్యార్థులకు వక్తృత్వ పోటీలు, సెల్ఫీ కాంటెస్ట్‌ పోటీలు నిర్వహించారు. పాలకోడేరు మండలం కుముదవల్లిలోని చైతన్య టెక్నో స్కూల్‌ ఆధ్వర్యంలో 150 అడుగుల జాతీయ జెండాతో హర్‌ఘర్‌ తిరంగా ర్యాలీ నిర్వహించారు. 

నరసాపురం పట్టణంలో సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం నుంచి జాతీయ జెండాలు చేతబట్టి ప్రదర్శన నిర్వహించారు. ప్రభుత్వ చీఫ్‌ విప్‌ ముదునూరి ప్రసాదరాజు, అధికారులు, ఉపాధ్యాయులు, పురపాలక సిబ్బంది, వైసీపీ నాయకులు, విద్యార్థులు 200 అడుగుల జాతీయ జెండాతో ముందుకు సాగారు. చైర్‌పర్సన్‌ వెంకటరమణ, ఉపాధ్యా యులు, సిబ్బంది పాల్గొన్నారు.  బీజీబీఎస్‌ మహిళా కళాశాల విద్యార్థినులు, వైఎన్‌ కళాశాల విద్యార్థులు భారీ ప్రదర్శన చేశారు.  భీమవరం పట్టణంలోని చక్కావారీ వీధి, భీమేశ్వర స్వామి ఆలయం పరిసర ప్రాంతాల్లో ఇంటింటికి విశ్వహిందూ పరిషత్‌ ఆధ్వర్యంలో శుక్రవారం త్రివర్ణ పతాకాలను వీహెచ్‌పీ రాష్ట్ర అధ్యక్షుడు వబిలిశెట్టి శ్రీవెంకటేశ్వర్లు అందించారు. భీమవరం పట్టణంలో శ్రీవిజ్ఞానవేదిక, లయన్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో శుక్రవారం సెయింట్‌ మేరీస్‌ విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. పాలకొల్లు రైల్వే గేటుసెంటర్‌లో రోటరీ క్లబ్‌ ఆఽఫ్‌ గోదావరి ఆధ్వర్యంలో వెయ్యి మందికి జెండాలను పంపిణీ చేశారు. చార్టర్‌ ప్రెసిడెంట్‌ చేగొండి సూర్యప్రకాష్‌ ముఖ్యఅతిథిగా విచ్చేసి స్వాతంత్య్ర ఉత్సవాల్లో రోటరీ క్లబ్‌ పాలుపంచుకోవడం అభినందనీయ మన్నారు. ఉండి మండలం కోలమూరు జడ్పీ ఉన్నత పాఠశాల వద్ద బీజేపీ జిల్లా ప్రధానకార్యదర్శి పేరిచర్ల సుభాష్‌రాజు ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహిం చారు. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూపతిరాజు శ్రీనివాసవర్మ మాట్లా డుతూ సమరయోధులను స్మరణ చేసుకుందామన్నారు.  బీజేపీ రాష్ట్ర కమిటీ క్రమశిక్షణ సంఘం చైర్మన్‌ పాక సత్యనారాయణ పార్టీ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నార్ని తాతాజీ, పేరిచర్ల శ్రీనివాసరాజు పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-13T05:45:09+05:30 IST