ఘనంగా జాతీయ చేనేత దినోత్సవం

ABN , First Publish Date - 2022-08-08T05:50:28+05:30 IST

భారత స్వాతంత్ర్యో ద్యమంలో ప్రధాన భూమిక పోషించి, స్వాతంత్య్ర సముపార్జనకు ఒక సాధనంగా నిలిచింది ‘చేనేత’ అని జిల్లా పరిషత్‌ చైర్‌ పర్సన్‌ కొరిపెల్లి విజ యలక్ష్మి రాంకిషన్‌ రెడ్డి అన్నారు.

ఘనంగా జాతీయ చేనేత దినోత్సవం

నిర్మల్‌ టౌన్‌, ఆగస్టు 7 : భారత స్వాతంత్ర్యో ద్యమంలో ప్రధాన భూమిక పోషించి, స్వాతంత్య్ర సముపార్జనకు ఒక సాధనంగా నిలిచింది ‘చేనేత’ అని జిల్లా పరిషత్‌ చైర్‌ పర్సన్‌ కొరిపెల్లి విజ యలక్ష్మి రాంకిషన్‌ రెడ్డి అన్నారు. ఆదివారం నిర్మ ల్‌ అంబేద్కర్‌ భవనంలో అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ చేనేత దినోత్సవం కార్యక్రమంలో ఆమె పాల్గొ న్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో పద్మశాలీనుద్దేశించి ఆమె మాట్లాడుతూ... గాంధీ జీ సైతం రాట్నంపై నూలు వడికేందుకు అత్యంత ప్రాధాన్యతనిచ్చారని, అంతటి ప్రాధాన్యత కలిగిన చేనేత రంగానికి ప్రత్యేకంగా ఒకరోజు ఉండాలన్న ఉద్దేశంతో జాతీయ చేనేత దినోత్సవాన్ని ఏర్పాటు చేశారన్నారు. 2017 ఆగస్టు 7న చెన్నైలో జరిగిన కార్యక్రమంలో ప్రస్తుత భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మొదటి చేనేత దినోత్సవాన్ని ప్రా రంభించారని, ఈ సందర్భంగా జాతీయ భారత చేనేత లోగోను ఆవిష్కరించి, ఆగస్టు ఏడో తేదీని జాతీయ చేనేత దినోత్సవంగా ప్రకటించి నిర్వహి స్తున్నట్లు చెప్పారు. అనంతరం చేనేత ప్రతిజ్ఞను చేసి, అంబేద్కర్‌ భవనం నుంచి ర్యాలీని నిర్వ హించారు. విద్యార్థులకు వ్యాసరచన పోటీలు ని ర్వహించి గెలుపొందిన వారికి బహుమతులు, ప్రశంసా పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ హేమంత్‌ బోర్కడే, మున్సిపల్‌ చైర్మన్‌ జి.ఈశ్వర్‌, సైక్టోరియల్‌ అధికారి శ్రీదేవి, పరీక్షల విభాగం అధికారి పద్మ, పద్మశాలీ సం ఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు జల్దా రమణ, జిల్లా అధ్యక్షుడు చిలుక రమణ, కౌన్సిలర్‌ బిట్లింగ్‌ నవీ న్‌, రేగుంట రాజేశ్వర్‌, అశోక్‌, రమేష్‌, పవన్‌, నరహరి, పట్టణంలోని పద్మశాలీలు పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-08T05:50:28+05:30 IST