Husband Wife Relationship: భార్యాభర్తలిద్దరూ ఎంత అన్యోన్యంగా ఉన్నా.. ఒకరితో మరొకరు చెప్పుకోని మూడు సీక్రెట్స్ ఇవి..!

ABN , First Publish Date - 2022-07-20T20:48:48+05:30 IST

జీవిత భాగస్వామి నుండి ఏదీ దాచకూడదని మనం తరచుగా వింటుంటాం, ఇద్దరి మధ్య కొన్ని విషయాలలో పరిధులుంటాయి.

Husband Wife Relationship: భార్యాభర్తలిద్దరూ ఎంత అన్యోన్యంగా ఉన్నా.. ఒకరితో మరొకరు చెప్పుకోని మూడు సీక్రెట్స్ ఇవి..!

వినయ - విజయ్ (పేర్లు మార్చాం) లది అన్యోన్య ఆదర్శ దాంపత్యం. పెద్దవాళ్లకి ఇంపుగా, పొరుగు వారికి కంటగింపుగా ఉండేది ఆ జంట అనుబంధం. మనసున మనసై, కళ్యాణమస్తు... వంటి ఆలుమగల టీవీ ప్రోగ్రామ్స్ లో కూడా వినయ - విజయ్ పాల్గొని ప్రైజులు కొట్టేశారు. ఇదంతా ఏడాది క్రితం;  అంత చక్కని జంట ఇప్పుడు విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కింది.


ఇంతలోనే ఏమయ్యింది?

జీవిత భాగస్వామి నుండి ఏదీ దాచకూడదని మనం తరచుగా వింటుంటాం, ఇద్దరి మధ్య కొన్ని విషయాలలో పరిధులుంటాయి. భార్యాభర్తలు ఒకరితో ఒకరు పంచుకోకుండా ఉండే కొన్ని విషయాలు ఉంటాయని వినయ విజయ్ జంట గ్రహించలేదంతే.


వివాహానంతరం భార్యాభర్తల అనుబంధం ఎంత బాగా ఉన్నా.. ఇద్దరి మధ్యా తరచూ పంచుకోని విషయాలు ఉంటానేది కాదనలేం. ప్రతి ఒక్కరికీ వారి స్వంత రహస్యాలు ఉంటాయనడంలో ఎటువంటి సందేహం లేదు. ఆ విషయాలను ఎవరితోనూ పంచుకోరు. ఇది మాత్రమే కాదు, ఏ జంట అయినా గతం గురించి బహిరంగంగా మాట్లాడటానికి ఇష్టపడరు. 


కొన్ని సంగతులు మనసు పొరల్లో దాచుకుని భాగస్వామితో పంచుకోకపోతేనే ఆ సంసారం సజావుగా సాగుతుంది. లేదూ మనసులో మాటను చెప్పుకుంటే, అది వారి సంబంధాన్ని ప్రభావితం చేస్తుంది. వైవాహిక జీవితంలో చీలిక ఏర్పడుతుంది. అటువంటి పరిస్థితిలో, భాగస్వామిపై నమ్మకం పోతుంది. భార్యాభర్తల మధ్య సంబంధంలో అనుమానం చోటు చేసుకుంటుంది. 


క్రష్ గురించి మాట్లాడుకోవద్దు.

ప్రతి భార్యాభర్తలు ఒకప్పటి తమ ప్రేమను గురించి గుర్తుచేసుకునే సందర్భం వస్తూనే ఉంటుంది. ఆమె లేదా అతను గురించిన జ్ఞాపకాలు మనసులో మెదిలే క్షణాలు వస్తూనే ఉంటాయి. అది కేవలం ఊహే కావచ్చు. అది ఊహే అయినా మీ భాగస్వామితో పంచుకోవడం మంచిది కాదు. ఇలాంటి విషయాలు ఇద్దరి మధ్యా పొరపొచ్చాలను తెచ్చిపెడతాయి. భార్యాభర్తలు కూడా తమ భాగస్వామితో అలాంటి ఫాంటసీలను పంచుకోవడానికి ఎప్పుడూ ఇష్టపడరు.


ఊహలను కూడా పంచుకోవద్దు.

చాలా మంది మగవారు సాధారణంగా భార్యకు వారిలో ఉన్న లోతైన లైంగిక కల్పనల గురించి చెప్పడానికి ఇష్టపడరు. ఇవి పంచుకోవడం వల్ల క్యారెక్టర్‌కి హాని కలుగుతుందని భావిస్తారు. భార్య తనిని ద్వేషించడం మొదలుపెడుతుందని, ఈ విషయం తెలియగానే తనలో అనుమానం మొదలవుతుందనే ఆలోచన కూడా వస్తుంది. ఇదే విషయంలో భార్య కూడా ఇలాంటి విషయాలు భర్తతో చెప్పడానికి వెనుకాడుతుంది. 


సోషల్ మీడియా ఖాతాలు మంచివేనా?

వినయ టీవీ ప్రోగ్రామ్స్ లో కనిపించే సరికి సోషల్ మీడియాలో కనిపించేసరికి Facebook-Instagram, Twitter వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు ఇప్పటి కాలంలో ఎవరితోనైనా కనెక్ట్ చేసేస్తాయి కదా..వినయ కూడా ఈ మాయలోనే పడింది. 


చాలా మంది భార్యాభర్తలు వారి పబ్లిక్ అకౌంట్‌తో పాటు ప్రైవేట్ ఖాతాను కూడా Maintain చేస్తూ ఉంటారు. వాటి ద్వారా ఏర్పడే పరిచయాలు, కొత్త వ్యక్తులతో మెసేజ్ లు అన్నీ కాస్త ఆనందాన్ని ఇస్తాయని భావిస్తారు. గతంలోని మాజీ బాయ్‌ఫ్రెండ్‌తో సన్నిహితంగా ఉంటారు. ఇవి తాత్కాలికంగా సంతోషాన్ని ఇచ్చినా, విషయం తెలిసాకా భార్యాభర్తల వైవాహిక జీవితంలోనూ మనస్పర్థలు మొదలవుతాయి. వీటికి దూరంగా పోనవసరం లేదు. కాస్త జాగ్రత్తగా మసులుకుంటే సరి.


మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన భార్యభర్తల మధ్య అన్యోన్యత కలకాలం ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఒకరినొకరు అర్థం చేసుకుని.. అభిప్రాయాలు, అభిరుచులు ఒకరికొకరు పంచుకుంటూ చిలకాగోరింకల్లా కలిసిమెలిసి ఉండాలంటే కొన్ని రహస్యాలను రహస్యాలుగానే ఉంచేయడం మంచిదేమో..


Updated Date - 2022-07-20T20:48:48+05:30 IST