ఘనంగా కృష్ణాష్టమి

ABN , First Publish Date - 2022-08-20T07:12:10+05:30 IST

మండల కేంద్రంలోని వివిధ పాఠశాలలో శుక్ర వారం శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘ నంగా జరుపుకున్నారు.

ఘనంగా కృష్ణాష్టమి
భైంసాలో శ్రీకృష్ణ,గోపికా వేషధారణలో విద్యార్థులు

జిల్లాలోని వైష్ణవదేవాలయాల్లో శ్రీకృష్ణజన్మాష్టమి ఘనంగా జరుపుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉట్టికట్టి.. శోభాయాత్ర నిర్వహించారు.  ప్రసాదవితరణలు చేశారు. అర్దరాత్రి దాటిన తర్వాత డోలారోహణ కార్యక్రమాలను నిర్వహించారు. వివిధ పాఠశాలల్లో విదార్థులతో శ్రీకృష్ణ గోపికా వేషధారణ చేయించి కార్యక్రమాలను నిర్వహించారు.  

ముథోల్‌, ఆగస్టు 19 : మండల కేంద్రంలోని  వివిధ పాఠశాలలో శుక్ర వారం శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘ నంగా జరుపుకున్నారు.  ఉదయం 7 గం టల నుంచి 11 గంటల వరకు ముథోల్‌ లోని ప్రధాన వీధులగుండా శోభా యా త్ర నిర్వహిస్తూ వివిధ సంఘాలు ఏర్పా టు చేసిన ఉట్టికొట్టే కార్యక్రమాలు చేపట్టారు. ప్రధాన వీధుల్లోను, కూడలిలలో ప్రదర్శనలు ఇచ్చారు. విద్యార్థుల వేషధారణలు, ప్రదర్శనలు చూపరులను ఆకట్టుకున్నాయి. ‘కృష్ణం వందే జగద్గురుమ్‌’ అనే నినాదాలతో ముథోల్‌లోని వీధులు మార్మోగాయి. అనంతరం పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో శ్రీకృష్ణ భగవానునికి పూజలు నిర్వహించి ఉట్టి పగులగొట్టారు. ఈ కార్య క్రమంలో పాఠశాల అధ్యక్షుడు కే.సంజీవ్‌, సమితి కార్యదర్శి ధర్మపురి సుద ర్శన్‌, పాఠశాల కార్యదర్శి కంది మా నాజీ, ప్రధానాచార్యులు సారథిరాజు, సుభాష్‌, ప్రవీణ్‌, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. 

ఖానాపూర్‌ : మండల కేంద్రంలో శుక్రవారం శ్రీకృష్ణాష్టమి వేడుకలను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా పలువురు చిన్నారులు శ్రీకృష్ణుడు, బలరాముడు, కుచేలుడు, గోపికలు, గోపి బాలుర వేషధారణలు ధరించారు. పట్టణంలోని పలు పాఠశాలల్లో శ్రీకృష్ణాష్టమి సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. 

భైంసా, ఆగస్టు 19 : పట్టణంలోని పలు ప్రైవేటు పాఠశాలలో శుక్రవారం కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. పాఠశాలల విద్యా ర్థులు, చిన్నారులు, శ్రీకృష్ణుడు గోపిక వేషాదారణతో వేడుకల్లో పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. పలు పాఠశాలల్లో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు వేడుకలను వన్నె తెచ్చాయి. శ్రీకృష్ణష్టమి వేడుకల ముగింపు సందర్భంగా నిర్వహించిన ఉట్టి కొట్టే కార్యక్రమం కోలాహలంగా కొనసాగింది. 

దిలావర్‌పూర్‌ : మండలంలోని శ్రీకృష్ణజన్మాష్టమి వేడుకలను ఘనంగా నిర్వ హించారు. ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల్లో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. చిన్నారులు గోపికలు, శ్రీకృష్ణ వేషధారణలతో అలరించారు. చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు అబ్బురపరిచాయి. ఉట్టికొట్టే కార్యక్రమం ఆకట్టుకుంది. 

తానూర్‌ : మండల కేంద్రం తానూర్‌తో పాటు మండంలోని జౌల(కే) బోర్‌ గావ్‌, బెంబర్‌, హిప్నెల్లి గ్రామాల్లో శుక్రవారం కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండలంలోని హిప్నెల్లి గ్రామంలోని పాఠశాల విద్యార్థులు కృష్ణుని, గోపికల వేషధారణలో సాంస్కృతి ప్రదర్శనలు నిర్వహించారు. మాజీ ఎంపీపీ బాశెట్టి రాజన్న, మాజీ సర్పంచ్‌ చక్రధర్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-20T07:12:10+05:30 IST