Abn logo
Sep 27 2021 @ 15:54PM

నావల్ల హుజురాబాద్‌ అభివృద్ధి కావడం సంతోషం: ఈటల

హైదరాబాద్: తన గొంతు నొక్కేందుకు సీఎం కేసీఆర్ వందల కోట్లు ఖర్చు చేస్తున్నారని మాజీమంత్రి ఈటల రాజేందర్ దుయ్యబట్టారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ హుజురాబాద్‌లో మద్యాన్ని ఏరులై పారిస్తున్నారని ఆరోపించారు. హుజురాబాద్‌లో 20ఏళ్ల వరకు అప్లికేషన్ పెట్టుకోకుండా అభివృద్ధి జరుగుతోందని తెలిపారు. తనవల్ల హుజురాబాద్‌ అభివృద్ధి కావడం సంతోషమన్నారు. కేసీఆర్ అహంకారానికి, ప్రజల ఆత్మగౌరవానికి మధ్య జరుగుతున్న ఎన్నికలని ఈటల రాజేందర్ తెలిపారు.


ఇవి కూడా చదవండిImage Caption