ఘనంగా స్నేహితుల దినోత్సవం

ABN , First Publish Date - 2022-08-08T06:14:51+05:30 IST

స్నేహితుల దినోత్సవాన్ని జిల్లా వ్యాప్తంగా ఆదివారం ఘనంగా జరుపుకున్నారు. ఇందులో భాగంగా అనకాపల్లి పట్టణంలోని జార్జిక్లబ్‌ ఆవరణలో గవరపాలెం ఉన్నత పాఠశాలలో 1991-92 విద్యా సంవత్సరంలో టెన్త్‌ చదువుకున్నవారంతా కలుసుకుని ఉదయం నుంచి సాయంతరం వరకు ఆనందంగా గడిపారు.

ఘనంగా స్నేహితుల దినోత్సవం
పరవాడ బాలుర ఉన్నత పాఠశాలలో పూర్వ విద్యార్థుల సందడి

   పలు చోట్ల పూర్వ విద్యార్థుల అపూర్వ కలయిక 

 సామాజిక సేవలో తరించిన మరికొందరు

అనకాపల్లి టౌన్‌, ఆగస్టు 7 : స్నేహితుల దినోత్సవాన్ని జిల్లా వ్యాప్తంగా ఆదివారం ఘనంగా జరుపుకున్నారు. ఇందులో భాగంగా అనకాపల్లి పట్టణంలోని  జార్జిక్లబ్‌ ఆవరణలో గవరపాలెం ఉన్నత పాఠశాలలో 1991-92 విద్యా సంవత్సరంలో టెన్త్‌ చదువుకున్నవారంతా కలుసుకుని ఉదయం నుంచి సాయంతరం వరకు ఆనందంగా గడిపారు. ఈ కార్యక్రమంలో కొణతాల అప్పలరాజు, విల్లూరి పరమేశ్వరరావు, ఆడారి నూకునాయుడు, కోరిబిల్లి రమేష్‌ తదితరులు పాల్గొన్నారు. అలాగే, రాజుపాలెంలోని పూర్వ విద్యార్థులు స్నేహితుల దినోత్సవాన్ని జరుపుకున్నారు. డాక్టర్‌ కేకేవీఏ నారాయణరావు ఆధ్వర్యంలో అంతా కలుసుకుని ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. గవరపాలెం కొణతాల సుబ్రహ్మణ్యం కల్యాణ మండపంలో బెస్ట్‌ ఫ్రెండ్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి ఏర్పాటు  చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.  క్లబ్‌ సభ్యులు కుటుంబ సమేతంగా హాజరై ఉల్లాసంగా.. ఉత్సాహంగా గడిపారు. అదేవిధంగా ఇక్కడి జీవీఎంసీ ఉన్నత పాఠశాలలో 1985-86 విద్యా సంవత్సరంలో పదో తరగతి పూర్వ విద్యార్థులు మిత్రమా కుశలమా అంటూ కుటుంబ సభ్యులతో కలిసి స్నేహితుల దినోత్సవాన్ని జరుపుకున్నారు.  ఈ కార్యక్రమంలో చెంబోలు మహదేవశాస్త్రి, దాసరి తాతారావు, బోని శ్రీనివాసరావు తదితరులు పాల్గొని అందరికీ  శుభాకాంక్షలు తెలిపారు. అలాగే గవరపాలెం ఉన్నత పాఠశాలలో 1986-87 పదో తరగతి బ్యాచ్‌ విద్యార్థులు స్నేహితుల దినోత్సవాన్ని జరుపుకున్నారు.  స్కూల్‌ ఆవరణలో మొక్కలు నాటి, అనంతరం నాటి గురువులను సత్కరించుకున్నారు.  ఈ కార్యక్రమంలో దాడి వెంకటరావు, మళ్ల మురళీ, ఆర్‌పీఎఫ్‌ హెడ్‌కానిస్టేబుల్‌ నాగేశ్వరరావు, శివాజీ, దాడి కృష్ణ, సతీష్‌ తదితరులు పాల్గొన్నారు. స్థానిక బెస్ట్‌ఫ్రెండ్స్‌క్లబ్‌ ఆధ్వర్యంలో ఎన్టీఆర్‌ వైద్యాలయంలో రోగులకు పండ్లు, రొట్టెలు పంచిపెట్టారు.  స్నేహితుల దినోత్సవం సందర్భంగా క్లబ్‌ చైర్మన్‌ బొడ్డేడ ఆదినారాయణ, అధ్యక్షుడు బుద్ద రమణాజీ వైద్యాలయంలో సూపరింటెండెంట్‌ డాక్టర్‌ శ్రావణ్‌కుమార్‌ చేతుల మీదుగా రోగులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేయించారు. ఈ కార్యక్రమంలో భీశెట్టి మహాలక్ష్మినాయుడు, విల్లూరి కాశీవిశ్వేశ్వరరావు, కర్రి సుబ్రహ్మణ్యం, కర్రి ఆనంద్‌, పెంటకోట నరసింగరావు, బుద్ద శ్రీనివాసరావు, బుద్ద బల్లమ్మనాయుడు,  పెంటకోట ప్రభాకరరావు, బుద్ద శివ తదితరులు పాల్గొన్నారు. 

తుమ్మపాల : అనకాపల్లి మహాత్మా జ్యోతిబా పూలే బీసీ సంక్షేమ పాఠశాలలో ఆదివారం స్నేహితుల దినోత్సవం ఘనంగా జరిగింది. ప్రధానోపాధ్యాయుడు డి. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ సృష్టిలో అన్ని బంధాలు కంటే స్నేహ బంధం చాలా గొప్పదన్నారు. పేరెంట్స్‌ క మిటీ చైర్మన్‌ కర్రి గంగాధర్‌, ఉపాధ్యాయ బృందం మహేంద్రనాథ్‌ పట్నాయక్‌, మధన్‌మోహన్‌ తదితరులు పాల్గొన్నారు.

నక్కపల్లి : మండలంలోని పలు గ్రామాల్లో ఆదివారం స్నేహితుల దినోత్సవాన్ని పిల్లల నుంచి పెద్దల వరకూ ఘనంగా జరుపుకున్నారు. నక్కపల్లి జడ్పీ ఉన్నత పాఠశాలలో 1986-87లో టెన్త్‌ చదివిన పూర్వ విద్యార్థులు రాజయ్యపేట తీరం ఒడ్డున, ఉపమాక ఆలయం వద్ద సమావేశమయ్యారు.  ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఉత్సాహంగా గడిపారు. అలాగే, దేవవరం, గొడిచెర్ల, నక్కపల్లి, జానకయ్యపేట, రాజయ్యపేట, డీఎల్‌పురం, చినదొడ్డిగల్లు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులు కూడా తమ గ్రామాల్లో స్నేహితుల దినోత్సవాన్ని నిర్వహించారు.

పరవాడ : ఇక్కడి బాలుర ఉన్నతి పాఠశాలలో  2000-01 విద్యా సంవత్సంలో పదో తరగతి చదువుకున్న వారంతా స్నేహితుల దినోత్సవం సందర్బంగా ఆదివారం పైడిమాంబ ఆలయ ప్రాంగణంలో కలుసుకున్నారు. ఆనాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. అందరు కలిసి సహపంక్తి భోజనాలు చేసి సాయంత్రం వరకు ఆటపాటలతో గడిపారు. అనంతరం తమతో పాటు చదువుకొని ఆర్మీలో ఉద్యోగ విరమణ చేసిన బండారు సన్యాసినాయుడు, మాకిరెడ్డి నాగేశ్వరరావు, కోన లక్ష్మీప్రసాద్‌, తుంపాల మరిడయ్య, రేఖ ముసిలినాయుడులను ఘనంగా సత్కరించారు. పూర్వ విద్యార్థులు పైలా చినఅక్కునాయుడు, పైలా రాము, మత్తుర్తి శ్రీనివాసరావు, పైలా సురేశ్‌, బోజంకి నాయుడు, గోరుపూటి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-08-08T06:14:51+05:30 IST