Jul 25 2021 @ 11:22AM

హ్యాపీ బ‌ర్త్ డే టు వెర్స‌టైల్ యాక్ట‌ర్‌, ప్రొడ్యూస‌ర్ నారా రోహిత్‌

తెలుగు చిత్ర సీమ‌లో వైవిధ్య‌మైన క‌థాంశాల‌తో సినిమాలు చేస్తూ క‌థానాయ‌కుడిగా త‌న‌కంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్న హీరో నారా రోహిత్‌. రాజ‌కీయ నేప‌థ్యం నుంచి రోహిత్ సినీ రంగ ప్ర‌వేశం చేయ‌డం విశేషం. ఆంధ్ర‌ప్ర‌దేశ్ మాజీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు సోద‌రుడు నారా రామూర్తి నాయుడు త‌న‌యుడైన రోహిత్‌.. తొలి సినిమా 'బాణం'తో హీరోగా ఎంట్రీ ఇచ్చి, రాగానే ఏదో మాస్ ఇమేజ్ సంపాదించేసుకోవాల‌ని, యాక్ష‌న్ హీరో అయిపోవాల‌ని అనుకోలేదు. త‌న బాడీలాంగ్వేజ్‌కు త‌గిన క‌థ‌ల‌తో సినిమాలు చేసి ప్రేక్ష‌కులను మెప్పించాల‌ని నిర్ణ‌యించుకుని అందుకు త‌గిన‌ట్లే సినిమాల‌ను సెల‌క్ట్ చేసుకుంటూ వ‌చ్చాడు. 

సోలో, సారొచ్చారు, ఒక్క‌డినే, ప్ర‌తినిధి, రౌడీఫెలో, అసుర‌, తుంట‌రి, సావిత్రి, రాజా చెయ్యి వేస్తే, జో అచ్యుతానంద‌, శంక‌ర‌, అప్ప‌ట్లో ఒక‌డుండేవాడు, శ‌మంత‌క‌మ‌ణి, క‌థ‌లో రాజ‌కుమారి, బాల‌కృష్ణుడు, ఆట‌గాళ్లు, వీర‌భోగ‌వ‌సంత‌రాయ‌లు వంటి సినిమాలతో ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేశాడు. అలాగే న‌టుడిగానే కాదు, నిర్మాత‌గానూ యంగ్ టాలెంట్‌ను ఎంక‌రేజ్ చేస్తూ సినిమాల‌ను నిర్మించ‌డం విశేషం. ఇండ‌స్ట్రీలో వివాదర‌హితుడిగా అంద‌రితో ఫ్రెండ్లీగా ఉంటూ స్వామి రారా, ఒక్క‌డు మిగిలాడు వంటి సినిమాల‌కు క‌థ‌కుడిగా వ్య‌వ‌హ‌రించిన రోహిత్.. మెంట‌ల్ మ‌దిలో, నీది నాది ఒకే క‌థ వంటి సినిమాల్లో అతిథి పాత్ర‌లో క‌నిపించి అల‌రించాడు. 

ప్ర‌స్తుతం నారా రోహిత్ హీరోగా చేస్తున్న 'అన‌గ‌న‌గా ద‌క్షిణాదిలో', 'శ‌బ్దం', 'మ‌ద్రాస్' చిత్రాలు నిర్మాణ ద‌శ‌లో ఉన్నాయి. హీరోగా, నిర్మాత‌గా రాణిస్తూ స్పెష‌ల్ ఇమేజ్‌ను సంపాదించుకున్న నారా రోహిత్ పుట్టిన‌రోజు ఆదివారం(జూలై 25) ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌కు చిత్ర‌జ్యోతి పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌ల‌ను తెలియ‌జేస్తోంది.