Chitrajyothy Logo
Advertisement
Published: Sat, 29 Jan 2022 09:30:04 IST

అమ్మా జన్మదిన శుభాకాంక్షలు: శంకరబాబు

twitter-iconwatsapp-iconfb-icon
అమ్మా జన్మదిన శుభాకాంక్షలు: శంకరబాబు

నేడు (జనవరి 29) మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజనా దేవి పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన తన తల్లికి సోషల్ మీడియా ద్వారా ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలను తెలిపారు. ఈ మేరకు ట్విట్టర్‌లో ఓ పోస్ట్ పెట్టారు. ఇందులో చిరు.."అమ్మా ! జన్మదిన శుభాకాంక్షలు.. క్వారెంటైన్ అయిన కారణంగా నీ ఆశీస్సులు ప్రత్యక్షంగా తీసుకోలేక ఇలా తెలుపుతున్నా..నీ చల్లని దీవెనలు ఈ జన్మకే కాదు మరు జన్మలకి కూడా కావాలని ఆ భగవంతుడ్ని కోరుకొంటూ అభినందనలతో.. శంకరబాబు" అని పేర్కొన్నారు. చిరును తన తల్లి అంజనా దేవి 'శంకరబాబు' అని పిలుస్తుంటారు. అందుకే ట్వీట్‌లోనూ ఆయన అదే పేరును రాసుకొచ్చారు. కాగా, ఇటీవల కరోనా సోకడంతో హోమ్ క్వారంటైన్‌లో ఉంటూ డాక్టర్ల సూచనల మేరకు మందులు వాడుతూ రెస్ట్ తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం బాగానే ఉంది. త్వరలోనే తిరిగి షూటింగులకు హాజరవుతారని సమాచారం.


Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Advertisement