ఘనంగా సంతోషిమాత జన్మదిన వేడుకలు

ABN , First Publish Date - 2022-08-13T05:51:30+05:30 IST

సంతోషిమాత జన్మదిన వేడుకలను జిల్లాకేంద్రంలోని అమ్మవారి ఆల యంలో శుక్రవారం అర్చకులు ఘనంగా నిర్వహించారు.

ఘనంగా సంతోషిమాత జన్మదిన వేడుకలు
సంతోషిమాత ఆలయంలో కుంకుమపూజలో మహిళలు

సూర్యాపేట కల్చరల్‌, ఆగస్టు 12: సంతోషిమాత జన్మదిన వేడుకలను జిల్లాకేంద్రంలోని అమ్మవారి ఆల యంలో శుక్రవారం అర్చకులు ఘనంగా నిర్వహించారు. అర్చకులు ఇరువంటి శివరామకృష్ణశర్మ 108 కలశాలతో పంచామృతాభిషేకాలు నిర్వహించారు.పట్టువస్త్రాలు సమ ర్పించి, ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారికి ఉద్యాపన వ్రతం నిర్వహించి భక్తులు వడిబియ్యం పోశారు. మహాపూర్ణాహుతి నిర్వహించి నామకరణ మహోత్సవం, పవళింపు సేవలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తుల సహకారంతో తయారు చేయించిన వెండి నక్షత్ర హారతి, వెండి కుంభ హరతి, వెండి అభిషేకాల సామాగ్రిని సమర్పించారు. రాఖీ వేడుకల సందర్భంగా బంగారు రాఖీని కట్టారు. రాఖీ పౌర్ణమిని పురస్కరించుకొని జడ్పీవైస్‌ చైర్మన్‌ గోపగాని వెంకటనారాయణగౌడ్‌, మునిసిపల్‌ చైర్‌పెరుమాళ్ళ అన్నపూర్ణ సంతోషి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. కార్యక్రమంలో నూక వెంకటేశంగుప్త, మురళీధర్‌, విద్యాసాగర్‌రావు, సత్యనారాయణ, రాంమూర్తి, పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-13T05:51:30+05:30 IST