ఆసరా పింఛన్లతో లబ్ధిదారుల్లో సంతోషం

ABN , First Publish Date - 2022-05-23T06:25:07+05:30 IST

ప్రభుత్వం అందిస్తున్న ఆసరా పింఛన్లతో లబ్ధిదారులు సంతోషంగా ఉన్నా రని రాష్ట్ర సాంస్కృతికసారిధి చైర్మన్‌, మానకొండూ ర్‌ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ అన్నారు.

ఆసరా పింఛన్లతో లబ్ధిదారుల్లో సంతోషం
వృద్ధుల సమస్యలు తెలుసుకుంటున్న ఎమ్మెల్యే

ఇల్లంతకుంట, మే 22: ప్రభుత్వం అందిస్తున్న ఆసరా పింఛన్లతో లబ్ధిదారులు సంతోషంగా ఉన్నా రని రాష్ట్ర సాంస్కృతికసారిధి చైర్మన్‌, మానకొండూ ర్‌ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌  అన్నారు. మండలంలోని పత్తికుంటపల్లెలో ఆదివారం వృద్ధుల క్షేమ సమాచారం అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం ఇచ్చే పిం ఛన్‌తో ఏమాత్రం సరిపోయేది కాదన్నారు. సీఎం కేసీఆర్‌ వృద్ధుల బాధలను అర్థం చేసుకొని పింఛన్‌ మొత్తాన్ని పెంచినట్లు చెప్పారు.   ఆసరా  పింఛన్‌ అర్హత వయస్సును తగ్గించడం ద్వారా మరింత మంది లబ్ధిపొందనున్నట్లు చెప్పారు. త్వరలోనే కొత్తవారికి పింఛన్లు వస్తాయన్నారు.  అనంతరం గాలిపెల్లి, పొత్తూర్‌లో విందు కార్యక్రమాలకు హాజర య్యారు. జడ్పీవైస్‌ చైర్మన్‌ సిద్దం వేణు, సెస్‌డైరెక్టర్‌  అయిలయ్యయాదవ్‌, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు  నర్సింహరెడ్డి, ఏఎంసీ చైర్మన్‌ సంజీవ్‌, ప్యాక్స్‌ చైర్మన్‌ అనంతరెడ్డి, సర్పంచులు శ్రీలతరవీందర్‌రెడ్డి,  అమ ర్‌గౌడ్‌, ఎంపీటీసీలు వనజఅనీల్‌కుమార్‌,  కిషోర్‌గౌడ్‌,  మాజీ ఏఎంసీ చైర్మన్‌ వేణురావు, నాయకులు  రాజేశం, ప్రశాంత్‌రెడ్డి, ముత్తయ్య, శ్రీనివాస్‌, వేని రమేష్‌, వెంకటేశం, మహిపాల్‌రెడ్డి పాల్గొన్నారు

Updated Date - 2022-05-23T06:25:07+05:30 IST