ఘనంగా హనుమాన్‌ శోభాయాత్ర

ABN , First Publish Date - 2022-05-26T06:16:09+05:30 IST

వీహెచ్‌పీ, భజరంగ్‌దళ్‌ నగర శాఖ ఆధ్వర్యంలో బుధవారం హనుమాన్‌ జయంతి సందర్భంగా శోభాయాత్ర బైక్‌ ర్యాలీ నిర్వహించారు.

ఘనంగా హనుమాన్‌ శోభాయాత్ర
ఏలూరులో హనుమాన్‌ శోభాయాత్ర

ఏలూరు కల్చరల్‌/ ఏలూరు క్రైం, జంగారెడ్డిగూడెం టౌన్‌/జీలుగుమిల్లి,  మే 25 : వీహెచ్‌పీ, భజరంగ్‌దళ్‌ నగర శాఖ ఆధ్వర్యంలో బుధవారం హనుమాన్‌ జయంతి సందర్భంగా శోభాయాత్ర బైక్‌ ర్యాలీ నిర్వహించారు. స్థానిక వసంతమహల్‌ దగ్గర నుంచి పురవీధుల గుండా ర్యాలీ కొనసాగింది. వీహెచ్‌పీ రాష్ట్ర నాయకుడు ఉత్తరాజు వేణుగోపాలరాజు ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు కార్యాలయ కార్యదర్శి కస్తూరి సూర్యప్రకాష్‌, వీహెచ్‌పీ జిల్లా అధ్యక్షుడు కె.సురేష్‌, నాగరాజు, ఆర్‌ఎస్‌ఎస్‌ నగర కార్యదర్శి చైతన్య, ప్రసన్న తదితరులు పాల్గొన్నారు.  ఏలూ రు నగరంలో హనుమాన్‌ శోభయాత్రకు పటిష్టమైన పోలీసు బందోబస్తును వన్‌టౌన్‌ సీఐ బోణం ఆది ప్రసాద్‌, టూటౌన్‌ ఎస్‌ఐలు ఎన్‌ఆర్‌ కిషోర్‌బాబు, జి.జ్యోతి బసు, ఏలూరు రూరల్‌ ఎస్‌ఐ ఎన్‌.లక్ష్మణబాబు వారి సిబ్బంది ఏర్పా టు చేశారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో  ధర్మజాగరణ సమితి ఆధ్వర్యంలో శోభా యాత్ర నిర్వహించారు. గుర్వాయిగూడెం మద్ది ఆంజనేయస్వామి ఆలయం నుంచి ప్రారంభించి అశ్వారావుపేట రోడ్డు, పాత బస్టాండ్‌ మీదుగా యాత్ర సాగింది. ముఖ్యఅతిథిగా ముంబైకు చెందిన భారతీ తీర్థానంద స్వామి విచ్చేయగా మద్ది ఆలయ ఈవో ఆకుల కొండలరావు స్వామివారి శేషవస్త్రములను సమర్పించారు. శోభాయాత్రలో పాల్గొన్న హిందూ సోదరులకు ముస్లిం జేఏసీ తరపున మంచినీళ్లు, బిస్కెట్లు పంపిణీ చేశారు. జీలుగుమిల్లి అభయాంజనేయస్వామి ఆలయంలో భజరంగ్‌ధళ్‌ సభ్యుల ఆధ్వర్యంలో బైక్‌ ర్యాలీ  నిర్వహించారు.

Updated Date - 2022-05-26T06:16:09+05:30 IST