భక్తి శ్రద్ధలతో హనుమాన్‌ జయంతి

ABN , First Publish Date - 2020-04-09T11:15:09+05:30 IST

భక్తి శ్రద్ధలతో హనుమాన్‌ జయంతిని నిర్వ హించారు. పట్టణంలోని పెద్దహనుమాన్‌ మందిరం, గౌలిగూడ హనుమాన్‌మందిరం

భక్తి శ్రద్ధలతో హనుమాన్‌ జయంతి

బాన్సువాడ టౌన్‌, ఏప్రిల్‌ 8: భక్తి శ్రద్ధలతో హనుమాన్‌ జయంతిని నిర్వ హించారు. పట్టణంలోని పెద్దహనుమాన్‌ మందిరం, గౌలిగూడ హనుమాన్‌మందిరం, వ్యాయామశాల హనుమాన్‌ మందిరం, శ్రీరామ మందిరం, పాతబాన్సువాడ హనుమాన్‌ మందిరాల్లో భక్తులు ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సింధూరంతో, వెండి తొడుగులతో స్వామి వారిని అలంకరించారు. పెద్దహనుమాన్‌ మందిరానికి కొత్త నారాయణ గుప్త 11 తులాల వెండిని, సిద్దంశెట్టి శివులు రూ.30వేల నగదును ఆలయ కమిటీ అధ్యక్షుడు మురళీకృష్ణ గుప్తకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ర్చకులు ఆకాశ శర్మ, దాతలు, కమిటీ సభ్యులు తదితరులున్నారు. 


బీర్కూర్‌ : హనుమాన్‌ జయంతిని భక్తులు బుధవారం నిరాడంబరంగా జ రుపుకున్నారు. బీర్కూర్‌ గ్రామ శివారులోని పడమటి హనుమాన్‌ ఆలయంలో భక్తులు భౌతిక దూరం పాటిస్తు పూజలు నిర్వహించారు. రథయాత్రను నిరా డంబరంగా నిర్వహించాలని నిర్ణయించారు.

Updated Date - 2020-04-09T11:15:09+05:30 IST