కసాపురంలో హనుమజ్జయంతి

ABN , First Publish Date - 2022-05-26T06:20:05+05:30 IST

కసాపురం దేవస్థానంలో దక్షిణాది హనుమజ్జయంతి వేడుకలను బుధవారం అత్యంత వైభవంగా నిర్వహించారు.

కసాపురంలో హనుమజ్జయంతి
అనంతపురంలోని హౌసింగ్‌ బోర్డులో అభయాంజనేయుడికి ప్రత్యేక అలంకరణ

గుంతకల్లు, మే 25: కసాపురం దేవస్థానంలో దక్షిణాది హనుమజ్జయంతి వేడుకలను బుధవారం అత్యంత వైభవంగా నిర్వహించారు. స్వామివారి మూలవిరాట్టును  ఉదయం అభిషేకించి, విశేష పుష్పాలంకరణ, తోమాల సేవ నిర్వహించి, వజ్ర కవచాలను అలంకరించారు. సుందరకాండ, మన్యుశూక్త పారాయణం చేశారు. యాగశాలలో హనుమంత హోమాన్ని నిర్వహించారు. సాయంత్రం 6 గంటలకు సీతారామస్వామికి పట్టాభిషేక మహోత్సవం నిర్వహించారు. ఆంజనేయుడి ఉత్సవ విగ్రహాన్ని ఒంటె వాహనంపై ఆశీనులనుగావించి సర్వాంగ సుందరంగా అలంకరించి, ప్రాకారోత్సవాన్ని నిర్వహించారు. వేడుకలలో ఈఓ వెంకటేశ్వరరెడ్డి, ట్రస్టుబోర్డు చైర్‌పర్సన కె.సుగుణమ్మ, ప్రధాన అర్చకుడు గరుడాచార్యులు, ట్రస్టుబోర్డు సభ్యులు, ఆలయ అధికారులు పాల్గొన్నారు.



Updated Date - 2022-05-26T06:20:05+05:30 IST