Americaలో వైభవంగా హనుమాన్ జయంతి వేడుకలు

ABN , First Publish Date - 2022-04-20T22:28:02+05:30 IST

అగ్రరాజ్యం అమెరికాలో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. న్యూమెక్సికో రాష్ట్రంలోని టావోస్ పట్టణంలో అమెరికన్లు నిర్మించిన హనుమంతుని ఆలయంలో జయంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా

Americaలో వైభవంగా హనుమాన్ జయంతి వేడుకలు

ఎన్నారై డెస్క్: అగ్రరాజ్యం అమెరికాలో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. న్యూమెక్సికో రాష్ట్రంలోని టావోస్ పట్టణంలో అమెరికన్లు నిర్మించిన హనుమంతుని ఆలయంలో జయంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. చుట్టూ మంచు పర్వతాలు, సమీపంలో రియోగ్రాండ్ నది ప్రవహిస్తుండగా అమెరికన్లు అఖండ హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. ఈ సందర్భంగా కొందరు సంగీత వాయిద్యాలతో చాలీసా పారయణం చేశారు. దీంతో ఆలయ పరిసరాలు భక్తి శ్రద్ధలతో పులకరించిపోయాయి. మారుతిపై అత్యంత భక్తి విశ్వాసాలు కలిగిన అమెరికన్లు సుదూర ప్రాంతాల నుంచి విచ్చేసి ప్రవాస భారతీయులకు తమ సహకారాన్ని అందించారు. ఒకవైపు ఆలయంలో చాలీసా పరాయణం జరుగుతుండగానే మరొవైపు ప్రసాద వితరణకు ఏర్పాట్లు చేశారు. ప్రసాదాల తయారీలో అమెరికన్లకు పలువురు ప్రవాస భారతీయలూ సహకరించారు.  



ఆలయ నేపథ్యం..

అధ్యాత్మిక సేవలో భాగంగా సద్గురువు శ్రీ నీమ్ కరోలీ బాబా మహారాజ్.. భారతదేశంలో ఎన్నో హనుమద్దేవాలయానలు నిర్మించారు. ఈయన అమెరికాలో అడుగిడలేకపోయినా.. 1973లో కరోలీ బాబా నిర్యాణం అనంతరం అమెరికన్లతో కలసి అగ్రరాజ్యంలో ఆలయాన్ని నిర్మించాలని శిశ్యులు సంకల్పించారు. ఈ నేపథ్యంలోనే సీతాదేవి అన్వేషణకు గగనయానం చేస్తున్న హనుమంతుని రూపుతో జైపూర్‌లో విగ్రహాన్ని తయారు చేయించారు. అనంతరం మెక్సికోకు చెందిన భక్తుడు విరాళంగా ఇచ్చిన గోశాలను సువిశాలమైన ఆలయంగా మార్చేశారు. నిర్మాణ పనులు పూర్తైన వెంటనే 2019లో అమెరికన్ భక్తులు సశాస్త్రీయంగా విగ్రహ ప్రతిష్ట జరిపారు. ఈ క్రమంలోనే ఆలయానికి పలువురు అమెరికన్లతోపాటు ప్రవాస భారతీయుల తాకిడి ఎక్కువైంది. ముఖ్యంగా వారాంతపు రోజుల్లో ఈ ఆలయం భక్తులతో కిటకిటలాడుతుంది. దైవ సేవలన్నీ ఇక్కడ ఉచితం. విరాళాల కోసం ఆలయ నిర్వహకులు ఎవరినీ సంప్రదించకపోవడం విశేషం. పూర్తిగా పశ్చాత్య సంస్కృతి ఉండే అమెరికాలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొనడం ఓ అద్భుతమనే చెప్పొచ్చు.




Updated Date - 2022-04-20T22:28:02+05:30 IST