భక్తిశ్రద్ధల హనుమజ్జయంతి వేడుకలు

ABN , First Publish Date - 2022-05-26T04:24:28+05:30 IST

కావలి మండలంలో బుధవారం హనుమజ్జయంతి వేడుకలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు.

భక్తిశ్రద్ధల హనుమజ్జయంతి వేడుకలు
ప్రసన్న ఆంజనేయుడికి పూజలు చేస్తున్న అర్చకులు

కావలి రూరల్‌, మే 25: కావలి మండలంలో బుధవారం హనుమజ్జయంతి వేడుకలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఆముదాలదిన్నె, తుమ్మలపెంట, అన్నగారిపాలెం, సిరిపురం, కొత్తపల్లి, గౌరవరం తదితర గ్రామాల్లోని ఆంజనేయస్వామి ఆలయాలు, విగ్రహాల వద్ద, రామాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహంచారు. ఆలయాలకు భక్తులు అధిక సంఖ్యలో చేరుకుని స్వామివారికి ఆకు పూజలు, అభిషేకాలు నిర్వహించారు. తుమ్మలపెంట గ్రామంలో వేడుకల్లో టీడీపీ కావలి నియోజక వర్గ ఇన్‌చార్జి మాలేపాటి సుబ్బానాయుడు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమాలల్లో పెదకాపు ఆవుల పోలయ్య, చిన్నకాపు ఆవుల శీనయ్య, వాయిల శ్రీనుబాబు, చెంచంగారి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. పట్టణంలోని ఆంజనేయస్వామి ఆలయాల్లో జయంతోత్సవాలు వైభవంగా జరిగాయి. ముసునూరు ట్రంకురోడ్డు వద్ద వెలసివున్న హనుమత్‌ క్షేత్రంలో ఆలయ వ్యవస్థాపక అర్చకుడు వేదగిరి సూర్యనారాణాచార్యులు పర్యవేక్షణలో ఉదయం 108 కలశములు స్థాపన, నవగ్రహ దోష నివారణకు శాంతి అభిషేకం, హోమం పూజల అనంతరం సామూహిక లక్ష తమలపాకుల సింధూర అర్చన పూజలు జరిగాయి. మధ్యాహ్నం ఆలయ ప్రాంగణంలో భక్తులకు అన్నదానం చేశారు. రాత్రి పూలంగి సేవల జరిగింది. జనతాపేట, వెంగళరావునగర్‌  ఆంజనేయస్వామి ఆలయాల్లో జయంతి వేడుకలు జరిగాయి.

Updated Date - 2022-05-26T04:24:28+05:30 IST