శబరి శ్రీరామక్షేత్రం నుంచి ఓష్ట్ర(ఒంటె) వాహనంపై ఆంజనేయుడి నగరోత్సవం
భక్తిశ్రద్ధలతో హనుమజ్జయంతి
స్వామి భక్తికి... ఆత్మ నిగ్రహానికి.. కార్యసిద్ధికి ప్రతీక అయిన హనుమంతుని జయంతిని జిల్లావాసులు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. ఆంజనేయ స్వామి మందిరాలు, ఆలయాలు, అన్ని వైష్ణవ క్షేత్రాల్లో బుధవారం ఉత్సవాలు వైభవంగా జరిగాయి. ప్రత్యేక పూజలు, అభిషేకాలు, విశేష అలంకారాలు, హోమాలు జరిగాయి. జై శ్రీరామ్.. జై హనుమాన్.. జై భజరంగభళి నామస్మరణ మారుమోగింది. పలుచోట్ల సుందరకాండ పారాయణం, అరణ్యకాండ ప్రవచనం, అన్నదానం జరిగాయి. భక్తులతో ఆలయాలు కిటకిటలాడాయి.
కపియే కదిలివచ్చెనంట...
నెల్లూరులోని క్రాంతినగర్‌లో గల శివకేశవస్వామి ఆలయంలో హనుమజ్జయంతి పూజలు జరుగుతుండగా ఓ మర్కకం (కోతి) వచ్చి భక్తిశ్రద్ధలతో స్వామివారికి మొక్కి, ప్రసాదం స్వీకరించి వెళ్లింది. ఈ సంఘటన భక్తులను ఆకట్టుకుంది.
- నెల్లూరు (సాంస్కృతికం)
నెల్లూరు : శివకేశవాలయంలో హనుమంతుని విగ్రహం ముందు ప్రసాదం ఆరగిస్తున్న మర్కటం
నెల్లూరు : శబరి శ్రీరామ క్షేత్రంలో లక్ష మల్లెల అర్చన చేస్తున్న భక్తులు