Jul 31 2021 @ 15:59PM

పేరు మార్చుకునేందుకు హన్సిక రెడీ అవుతోంది

బబ్లీ బ్యూటీ హన్సిక ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం ‘మై నేమ్‌ ఈజ్‌ శృతి’. ది హిడెన్‌ ట్రూత్‌ అనేది ఉపశీర్షిక. వైష్ణవి ఆర్ట్స్‌ పతాకంపై రమ్య బురుగు, నాగేందర్‌ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి డి. శ్రీనివాస్‌ ఓంకార్‌ దర్శకుడు. ఇటీవల చిత్రీకరణ ప్రారంభమైన ఈ చిత్రం తొలిషెడ్యూల్‌ని పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా దర్శకుడు చిత్ర విశేషాలను మీడియాకు తెలియజేశారు.


ఆయన మాట్లాడుతూ.. ‘‘బ్యాక్‌ అండ్‌ ఫోర్త్‌ స్క్రీన్‌ప్లేతో రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రంలో హన్సిక ఇప్పటి వరకు తన కెరియర్‌లో చేయనటువంటి సరికొత్త పాత్రలో చేస్తోంది. సస్సెన్స్‌ థ్రిల్లర్ చిత్రాలను ఎంజాయ్‌ చేసే ప్రేక్షకులకు ఒక మంచి అనుభూతిని కలిగించే చిత్రమిది. ఓ యువతి తన జీవితంలో ఎదురైన సంఘర్షణలను ఎలా ఎదుర్కొన్నది అనేదే చిత్ర కథాంశం. ఫస్ట్ షెడ్యూల్ దిగ్విజయంగా కంప్లీట్ అయింది. ఆగస్టు రెండో వారంలో రెండో షెడ్యూల్‌ని ప్రారంభిస్తాం’’ అన్నారు. మురళీశర్మ, జయప్రకాష్‌, ఆడుకాలం నరెన్‌, రాజా రవీంద్ర, సీవీఎల్‌ వినోదిని, సాయితేజ్‌ కాల్వకోట, మహేష్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి మార్క్‌.కె. రాబిన్ సంగీతం అందిస్తున్నారు.