హనుమకొండ: జిల్లాలోని కమలాపూర్‌లో ఆర్ఎంపీ వైద్యుడి అబార్షన్స్ దందా వెలుగులోకి వచ్చింది. ఎలాంటి అర్హత లేకున్నా పాలిక్లినిక్ పేరుతో అమాయక మహిళలకు సమ్మయ్య అనే వ్యక్తి అబార్షన్స్ చేస్తున్నాడు. సమాచారం తెలిసిన టాస్క్ ఫోర్స్, వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు క్లినిక్‌పై దాడులు చేశారు. క్లినిక్‌లో అబార్షన్స్ జరుగుతున్నట్లు గుర్తించిన అధికారులు... వెంటనే ఆర్ఎంపీ పాలీ క్లినిక్‌ను సీజ్ చేశారు. ఆర్ఎంపీ సమ్మయ్యతో పాటు మరో వ్యక్తిని అరెస్ట్ చేశారు.