హనుమకొండ: జిల్లాలోని ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. స్వామి వారికి ఇవాళ నూతన వస్త్రాలంకరణ, విఘ్నేశ్వర పూజ, పున్యాహవచనం, ధ్వజారోహణం, మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, మహనివేదన నీరాజన మంత్రపుష్పం తీర్థప్రసాద వితరణ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. కరోనా నిబంధనలు పాటిస్తూ రెండు డోసు టీకాలు వేసుకున్న వారికే ఆలయ అధికారులు దర్శనానికి అనుమతి ఇస్తున్నారు.
ఇవి కూడా చదవండి