హన్మకొండ: జిల్లాలోని కాజీపేట కడిపికొండలో దారుణం జరిగింది. కొందరు గుర్తుతెలియని వ్యక్తులు నవజాత శిశువు మృతదేహాన్ని రోడ్‌పై వదిలివెళ్లారు. దీంతో అక్కడకు చేరుకున్న వీధి కుక్కలు శిశువు మృతదేహాన్ని పీక్కుతున్నాయి. ఆ దృశ్యం అక్కడి వారిని కలచివేసింది. స్థానికుల సమాచారం మేరకు అక్కడకు చేరుకున్న పోలీసులు శిశువు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.
ఇవి కూడా చదవండి