Telangana: మద్యం మత్తులో వైద్యుడి వీరంగం
ABN , First Publish Date - 2022-04-26T13:50:23+05:30 IST
మద్యం మత్తులో ఓ వైద్యుడు వీరంగం సృష్టించాడు.
హనుమకొండ: మద్యం మత్తులో ఓ వైద్యుడు వీరంగం సృష్టించాడు. జిల్లాలోని సుబేదారి పోలీస్ స్టేషన్ పరిధిలో గత రాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేస్తుండగా ఓ వ్యక్తి హంగామా చేశాడు. పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని పరీక్షల కోసం ఎంజీఎం హాస్పిటల్కు తీసుకురాగా తాను డాక్టర్ నాని అంటూ హల్చల్ చేశాడు. డ్యూటీ డాక్టర్ల కుర్చీలో కూర్చుని పోలీసులకు చుక్కలు చూపాడు. ‘‘మెడికల్ టెస్టులకు సపోర్ట్ చేయకపోగా నన్నే ఆపుతారా మీ సంగతి చెపుతా’’నని పోలీసులకు వార్నింగ్ ఇచ్చాడు.