హనుమకొండలో BJP ధర్నా, రాస్తారోకో

ABN , First Publish Date - 2022-01-31T18:08:20+05:30 IST

సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ హనుమకొండ చౌరస్తాలో బీజేపీ ధర్నా, రాస్తారోకో నిర్వహించింది.

హనుమకొండలో BJP ధర్నా, రాస్తారోకో

హనుమకొండ: సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ హనుమకొండ చౌరస్తాలో బీజేపీ ధర్నా, రాస్తారోకో  నిర్వహించింది. పార్టీ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ, మాజీ మంత్రి గుండె విజయరామారావు, బీజేవైఎం నేతలు ధర్నాలో పాల్గొన్నారు. ఉద్యోగ నోటిఫికేషన్‌లు విడుదల చేయడంతో పాటు నిరుద్యోగ భృతి వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా రావు పద్మ మాట్లాడుతూ... వరంగల్ అభివృద్ధికి కేంద్రం నిధులు ఇస్తుంటే టీఆర్ఎస్ పాలకులు దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. కోచ్ ఫ్యాక్టరీ పేరున అఖిలపక్షం అని రాద్ధాంతం చేస్తున్నారు కానీ టీఆర్‌ఎస్, కాంగ్రెస్ రెండూ ఒకటే అని అన్నారు. కోచ్ ఫ్యాక్టరీ తరలివెళ్లడానికి కారణం కాంగ్రెస్ కాదా అని ప్రశ్నించారు. కాజీపేటలో పీవోహెచ్ నిర్మాణానికి కేంద్రం 380 కోట్లు రిలీజ్ చేస్తే ఇంత వరకు భూమి ఇవ్వలేదని మండిపడ్డారు. వినయ్ భాస్కర్ అబద్ధాల కోరన్నారు. పీవోహెచ్‌కు ల్యాండ్ ఇవ్వకున్నా ఇచ్చామని మాట్లాడుతున్నారని... దీనిపై చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. కేంద్రం సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కోసం 120 కోట్లు ఇస్తే అందులో ఉద్యోగాలు అమ్ముకున్నారని రావు పద్మ ఆరోపించారు. 

Updated Date - 2022-01-31T18:08:20+05:30 IST