అర్హులందరికీ చేనేత నేస్తం అందించాలి

ABN , First Publish Date - 2022-08-15T04:43:27+05:30 IST

అధునాతన పద్ధతిలో ప్రజలకు వస్త్రాలను అందించే చేనేతలకు వారు కొరుగోలు చేసే ముడిసరుకుకు జీఎస్టీ నుంచి మినహాయింపు ఇవ్వాలని ఎమ్మెల్యే గొట్టిపాటి రవి కుమార్‌ డిమాండ్‌ చేశారు.

అర్హులందరికీ చేనేత నేస్తం అందించాలి
చేనేతల మగ్గాలను పరిశీలిస్తున్న రవికుమార్‌

మగ్గాలను పరిశీలించిన ఎమ్మెల్యే రవికుమార్‌

బల్లికురవ, ఆగస్టు 14 అధునాతన పద్ధతిలో ప్రజలకు వస్త్రాలను అందించే చేనేతలకు వారు కొరుగోలు చేసే ముడిసరుకుకు జీఎస్టీ నుంచి మినహాయింపు ఇవ్వాలని ఎమ్మెల్యే గొట్టిపాటి రవి కుమార్‌ డిమాండ్‌ చేశారు. ఆదివారం మండలం లోని నక్కబొక్కలపాడు గ్రామంలో చేనేత మగ్గాలు నడుపుతున్న 20 కుటంబాల వారిని ఎమ్మెల్యే కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకొన్నారు. అనంత రం చేనేతలు తయారు చేసిన చీరలను,  మగ్గాల ను అయన పరిశీలించారు.

ఈ సందర్భంగా రవికుమార్‌ మాట్లాడుతూ ప్రభుత్వాలు చేతి వృత్తిపై ఆధారపడి జీవనం సాగి స్తున్న చేనేతల అభ్యున్నతికి చేయూత నివ్వాల న్నారు. గతంలో రెండుమార్లు అర్బాటంగా చేనేత నేస్తం అందించి, ఇప్పుడు  అరకొర పొలంను లింక్‌ పెట్టి మీకు రైతు భరోసా వస్తున్నందున నేస్తం పథ కం నుంచి తొలగించటం బావ్యం కాదన్నారు. అర్హత ఉన్న అందరికి ప్రభుత్వం పథకాలు ఇస్తున్నామని చెప్పి చేనేతలకు ప్రభుత్వం మొండిచేయి చూపు తుందన్నారు. సంప్రదాయ కళలను ప్రోత్సహించేలా టీడీపీ ప్రభుత్వ హయంలో చేనేత కుటుంబాలకు మోటార్లను అందజేసినట్టు చెప్పారు. 

ఈ సందర్భంగా చేనేత కుటుంబాలకు చెందిన మహిళలు తాము సొంతంగా తయారుచేసిన చీర లను ఎమ్మెల్యే రవికుమార్‌కి చూపించి తాము పడుతున్న ఇబ్బందులను వివరించారు.  కార్యక్ర మంలో  టీడీపీ నేతలు కొండేటి ఇజ్రాయల్‌, దూళి పాళ్ల హనుమంతరావు, గొట్టిపాటి శంకర్‌, అమర నేని కాశీవిశ్వనాధం, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-08-15T04:43:27+05:30 IST