ఏటీఎంలో దొరికిన నగదు పోలీసులకు అప్పగింత

ABN , First Publish Date - 2021-09-29T05:53:03+05:30 IST

ఏటీఎంలో డబ్బులు డ్రా చేసి ఓ వ్యక్తి తీసుకెళ్లకుండా వెళ్లిపోగా అనంతరం అక్కడికొచ్చిన మున్వర్‌ షరీఫ్‌ మిషన్‌లో ఉన్న డబ్బులను మొత్తాన్ని నల్లగొండ వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో అప్పగించి మానవత్వాన్ని చాటుకున్నాడు

ఏటీఎంలో దొరికిన నగదు పోలీసులకు అప్పగింత
డబ్బులను పోలీసులకు అందజేస్తున్న మున్వర్‌

నల్లగొండ క్రైం, సెప్టెంబరు 28 : ఏటీఎంలో డబ్బులు డ్రా చేసి ఓ వ్యక్తి తీసుకెళ్లకుండా వెళ్లిపోగా అనంతరం అక్కడికొచ్చిన మున్వర్‌ షరీఫ్‌ మిషన్‌లో ఉన్న డబ్బులను మొత్తాన్ని నల్లగొండ వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో అప్పగించి మానవత్వాన్ని చాటుకున్నాడు. వివరాల్లోకి వెళితే నల్లగొండ వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో పాతబస్తీ చౌరస్తా ప్రాంతంలో హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంకు ఏటీఎంలో డబ్బులు డ్రా చేయడానికి నల్లగొండ పట్టణానికి చెందిన మున్వర్‌ షరీ్‌ఫ వెళ్లాడు. మిషన్‌లో రూ.10వేలు బయట ఉండడం గమనించి ఆ మొత్తాన్ని వన్‌టౌన్‌ ఎస్‌ఐ నరే్‌షకు అప్పగించి, నిజాయితీ చాటుకున్నాడు. డబ్బులు మరిచిపోయిన వ్యక్తి పోలీస్‌స్టేషన్‌లో సంప్రదిస్తే ఏటీఎం సీసీ పుటేజ్‌ పరిశీలించి నిర్ధారణ చేసిన అనంతరం అప్పగిస్తామని ఎస్‌ఐ నరేష్‌ తెలిపారు. నిజాయితీతో, బాధ్యతాయుతంగా పోలీస్‌ స్టేషన్‌లో డబ్బులు అప్పగించిన మున్వర్‌ షరీ్‌ఫను ఎస్‌ఐ నరేష్‌ అభినందించారు. 


Updated Date - 2021-09-29T05:53:03+05:30 IST