Viral Video: పోలీసులకు ఊహించని షాక్.. దొంగను పట్టుకుని వ్యానులో తీసుకుని వెళుతుంటే..

ABN , First Publish Date - 2022-01-11T01:48:49+05:30 IST

నిజ జీవితంలో జరిగే కొన్ని సంఘటనలు ఒక్కోసారి భలే అశ్చర్యం కలిగిస్తుంటాయి. ఇలాంటివి కూడా ఉంటాయా అని అవాక్కయ్యేలా చేస్తుంటాయి. అటువంటి ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది.

Viral Video: పోలీసులకు ఊహించని షాక్.. దొంగను పట్టుకుని వ్యానులో తీసుకుని వెళుతుంటే..

ఇంటర్నెట్ డెస్క్: నిజ జీవితంలో జరిగే కొన్ని సంఘటనలు ఒక్కోసారి భలే అశ్చర్యం కలిగిస్తుంటాయి. ఇలాంటివి కూడా ఉంటాయా అని అవాక్కయ్యేలా చేస్తుంటాయి. అటువంటి ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది. బ్రెజిల్‌లోని పారిబాలా ప్రాంతంలో స్థానిక పోలీసులు ఓ దొంగకు బేడీలు వేసి ఓ వ్యానులో తీసుకుని వెళుతుండగా.. అతడు వ్యానులోంచి మెల్లగా దూకేసీ తప్పించుకున్నాడు. ఇదంతా అక్కడున్న సీసీటీవీల్లో రికార్డైంది. దొంగ పారిపోతున్నా కూడా వ్యాను మాత్రం అలాగే ముందుకెళ్లిపోయింది.


స్థానిక మీడియా కథనాల ప్రకారం.. పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నాకే పోలీసులు దొంగ పారిపోయిన విషయాన్ని గుర్తించారట. అయితే.. ఈ ఘటన తాలూకు వీడియో క్లిప్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఇప్పటికే దీనికి మూడు లక్షలకు పైగా వ్యూస్ వచ్చిపడ్డాయి. నెటిజన్ల నుంచి రకరకాల రియాక్షన్లు వస్తున్నాయి. కొందరికి ఇదంతా నవ్వు తెప్పిస్తుంటే మరికొందరు మాత్రం పోలీసులపై సీరియస్ అవుతున్నారు. ఇలాంటివి ఎలా జరుగుతాయో అర్థం కావట్లేదు అంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. 



Updated Date - 2022-01-11T01:48:49+05:30 IST