Tungabhadra Reservoir: నీట మునిగిన హంపి మండపాలు

ABN , First Publish Date - 2022-08-10T17:14:51+05:30 IST

తుంగభద్ర జలాశయం నుంచి వరద నీటిని భారీస్థాయిలో వదలడంతో హంపి(Hampi)లోని మండపాలు నీట మునిగాయి. హంపి ప్రాంతంలోని కోదండరామ

Tungabhadra Reservoir: నీట మునిగిన హంపి మండపాలు

కంప్లి(బెంగళూరు), ఆగస్టు 9: తుంగభద్ర జలాశయం నుంచి వరద నీటిని భారీస్థాయిలో వదలడంతో హంపి(Hampi)లోని మండపాలు నీట మునిగాయి. హంపి ప్రాంతంలోని కోదండరామ దేవస్థానాన్ని తాకుతూ కంప్లి కోటలోని ఆంజనేయస్వామి దేవస్థానం పూర్తిగా మునిగిపోయింది. కంప్లికోట వద్ద వంతెన పూర్తిగా నీట మునగడంతో రాకపోకలు నిలిచిపోయాయి. నదికి అత్యధికంగా నీరు రావడంతో చేపల వేటకు వెళ్లలేక జీవనం గడవక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత 20 రోజులుగా జలాశయం నుంచి నదికి భారీఎత్తున నీరు రావడంతో తుంగభద్ర(Tungabhadra) నది తీరాన వుండే రైతన్నలు, మత్స్యకారులు పూర్తిగా ఇబ్బందులకు గురవుతున్నారు. 

Updated Date - 2022-08-10T17:14:51+05:30 IST