త్రివర్ణ శోభిత hampi..!

ABN , First Publish Date - 2021-10-15T13:00:04+05:30 IST

స్వాతంత్ర అమృత మహోత్సవం, దేశవ్యాప్తంగా వందకోట్ల ప్రజలకు కొవిడ్‌ టీకా పూర్తి అయిన నేపథ్యంలో విజయానికి సాంకేతికంగా ప్రపంచ ప్రసిద్ధి గాంచిన హంపిలోని చారిత్రక కట్టడాలు విద్యుత్‌ కాంతుల న

త్రివర్ణ శోభిత hampi..!

బళ్లారి(కర్ణాటక): స్వాతంత్ర అమృత మహోత్సవం, దేశవ్యాప్తంగా వందకోట్ల ప్రజలకు కొవిడ్‌ టీకా పూర్తి అయిన నేపథ్యంలో విజయానికి సాంకేతికంగా ప్రపంచ ప్రసిద్ధి గాంచిన హంపిలోని చారిత్రక కట్టడాలు విద్యుత్‌ కాంతుల నడుమ వెలిగి మిరంత అందాన్ని తెచ్చుకుని వీక్షకులకు కనువిందు చేస్తున్నాయి. దేశ వ్యాప్తంగా ప్రముఖ స్మారకాలకు త్రివర్ణ పతాకం రంగుల వర్ణంతో విద్యుత్‌ దీపాలను అలంకరించారు. అందులో హంపి చేర్చడం విశేషం. భారతీయ పురాతత్వ శాఖ. ఇందులో హంపిలోని రాతి రథం, విజయ విఠల దేవస్థానంలోని ఏనుగు సాలు మంటపాలకు విద్యుత్‌ కాంతులతో అలంకరించడం విశేషం. ఈ నెల 17 వరకు విద్యుత్‌ అలంకరణలు కొనసాగిస్తామని పురాతత్వ సంరక్షణ శాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ అనిరుద్ద దేశాయి ప్రకటించారు. పండుగ నేపథ్యంలో వరుసగా సెలవు రోజులు కావడంతో హంపికి ఎక్కువ సంఖ్యలో పర్యాటకులు విచ్చేస్తున్నారు. విద్యుత్‌ దీపాలంకరణ చూసి తన్మయత్వం పొందుతున్నారు.

Updated Date - 2021-10-15T13:00:04+05:30 IST