హామిల్టన్‌.. థ్రిల్లింగ్‌ స్టంట్‌

ABN , First Publish Date - 2021-06-01T10:23:34+05:30 IST

ఫార్ములా-1 చాంపియన్‌, మెర్సిడెస్‌ డ్రైవర్‌ లూయిస్‌ హామిల్టన్‌.. ట్రాక్‌పై చేసే ఫీట్లకు కొదవేలేదు. అయితే, ట్రాక్‌ బయట కూడా సాహసమే జీవితంగా ఎంజాయ్‌ చేస్తున్నాడు.

హామిల్టన్‌.. థ్రిల్లింగ్‌ స్టంట్‌

దుబాయ్‌: ఫార్ములా-1 చాంపియన్‌, మెర్సిడెస్‌ డ్రైవర్‌ లూయిస్‌ హామిల్టన్‌.. ట్రాక్‌పై చేసే ఫీట్లకు కొదవేలేదు. అయితే, ట్రాక్‌ బయట కూడా సాహసమే జీవితంగా ఎంజాయ్‌ చేస్తున్నాడు. తాజాగా అతడు స్కై డైవింగ్‌ స్టంట్‌ చేస్తున్న వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశాడు. కొన్నేళ్లుగా దుబాయ్‌లో తాను స్కై డైవింగ్‌లో శిక్షణ తీసుకొంటున్నట్టు హామిల్టన్‌ పేర్కొన్నాడు.


 ‘దాదాపు రెండేళ్లుగా డైవింగ్‌ నేర్చుకొంటున్నా. ఖాళీ సమయంలో నేను చేసే ఇష్టమైన పనుల్లో ఇదొకటి. వెల్లకిలా ఉండి ఈ ఫీట్‌ను చేసేందుకు తొలిసారి ప్రయత్నిస్తున్నా. అయితే, నాకు పెద్దగా రాదనుకోండి. తర్వాత విండ్‌ టన్నెల్‌లో ప్రాక్టీస్‌ చేస్తాన’ని హామిల్టన్‌ చెప్పాడు. విమానంలోంచి కింద దూకిన హామిల్టన్‌.. కొంతసేపు మేఘాల్లో తేలియాడిన తర్వాత పారాచూట్‌ ఓపెన్‌ చేయడం ఆ వీడియోలో కనిపించింది. 

Updated Date - 2021-06-01T10:23:34+05:30 IST