రామేశ్వ‌రంలో అద్భుత సూర్య ద‌ర్శ‌నం.... అల‌రిస్తున్న వీడియో!

ABN , First Publish Date - 2020-08-04T10:57:36+05:30 IST

రాక్షబంధన్ రోజున త‌మిళ‌నాడులోని రామేశ్వరంలో ఆకాశంలో ఒక అద్భుత దృశ్యం ఆవిష్కృత‌మ‌య్యింది. ఈ ప్రాంతంలోని ప్ర‌జ‌లంతా సూర్యుడిని చూసి ఆశ్చర్యపోయారు. సూర్యుని చుట్టూ ఒక ప్రత్యేకమైన

రామేశ్వ‌రంలో అద్భుత సూర్య ద‌ర్శ‌నం.... అల‌రిస్తున్న వీడియో!

రామేశ్వ‌రం: రాక్షబంధన్ రోజున త‌మిళ‌నాడులోని రామేశ్వరంలో ఆకాశంలో ఒక అద్భుత దృశ్యం ఆవిష్కృత‌మ‌య్యింది. ఈ ప్రాంతంలోని ప్ర‌జ‌లంతా సూర్యుడిని చూసి ఆశ్చర్యపోయారు. సూర్యుని చుట్టూ ఒక ప్రత్యేకమైన ఉంగరం క‌నిపించింది. దీనిని హాలో ఎఫెక్ట్ అని అంటారు. ఈ విధంగా సంవత్సరంలోని 365 రోజులలో సుమారు 100 రోజులలో సూర్యుడు ఇలా క‌నిపిస్తాడు. ఈ దృశ్యం చూప‌రుల‌కు వింత అనుభూతిని క‌లిగించింది. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. అరగంటకు పైగా ఆకాశంలో క‌నిపించిన ఈ దృశ్యాన్ని స్థానికులు ఆస‌క్తిక‌రంగా తిల‌కించారు.

                 కింగ్ ఆఫ్ సీ వ‌ర‌ల్డ్ సౌజ‌న్యంతో....



Updated Date - 2020-08-04T10:57:36+05:30 IST