భాషా వలంటీర్ల అర్ధనగ్న ప్రదర్శన

ABN , First Publish Date - 2022-01-25T06:02:27+05:30 IST

తమను రెన్యువల్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ భాషా వలంటీర్లు సోమవారం అర్ధనగ్న ప్రదర్శన చేశారు.

భాషా వలంటీర్ల అర్ధనగ్న ప్రదర్శన
ముంచంగిపుట్టులో అర్ధనగ్న ప్రదర్శన చేస్తున్న భాషా వలంటీర్లు


ముంచంగిపుట్టు, జనవరి 24: తమను రెన్యువల్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ భాషా వలంటీర్లు సోమవారం అర్ధనగ్న ప్రదర్శన చేశారు. గిరిజన సంఘం, భాషా వలంటీర్ల సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరహార దీక్షలు సోమవారం ఐదవ రోజుకు చేరుకున్నాయి. ఈ దీక్షలకు సీఐటీయూ మండల కమిటీ మద ్దతు ప్రకటించింది. ఈ సందర్భంగా సీఐటీయూ సంఘం నాయకులు కె.శంకరరావు, కె.త్రినాథ్‌ మాట్లాడుతూ..గిరిజన ప్రాంతం లో అక్షరాస్యత పెరగడానికి కీలకపాత్ర పోషిస్తున్న భాషా వలంటీర్లను రెన్యువల్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో ఆయా సంఘాల నాయకులు పి. భీమరాజు, కె. గణేశ్వరరావు, బలరాం, గణపతి, బాలకృష్ణ, గోపాల్‌  పాల్గొన్నారు.

 

Updated Date - 2022-01-25T06:02:27+05:30 IST