Abn logo
Sep 24 2021 @ 19:55PM

విశాఖ జిల్లాలోనే సగం డెంగ్యూ కేసులు

అమరావతి: రాష్ట్రంలో నమోదైన డెంగ్యూ కేసుల్లో సగం విశాఖ జిల్లాలోనే నమోదయ్యాయని వైద్యారోగ్యశాఖ కమిషనర్ భాస్కర్ తెలిపారు. వైద్యారోగ్యశాఖపై  సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించినట్లు ఆయన తెలిపారు. ఆస్పత్రుల్లో ఔషధాల కొరత లేదన్నారు. కరోనా దృష్ట్యా ఐదారు రెట్ల ఔషధాలను కొనుగోలు చేసి నిల్వ చేస్తున్నామని భాస్కర్ పేర్కొన్నారు.  వైద్యారోగ్యశాఖలో 14,200 పోస్టులకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని భాస్కర్ తెలిపారు. డాక్టర్లు, నర్సులు, ఫార్మసిస్ట్ పోస్టుల భర్తీకి నిర్ణయం తీసుకుందని ఆయన పేర్కొన్నారు.


ఈ-ఔషది వెబ్‌సైట్‌లో ఎక్కడా సమస్యలు లేవన్నారు. సబ్‌సెంటర్ స్థాయి వరకు టెలిమెడిసిన్ సేవలు తీసుకెళ్లామన్నారు. ఔషధాల వినియోగంలో అత్యవసర పరిస్థితిని అనుసరించి కేటాయింపులు చేసామన్నారు. క్యాన్సర్ చికిత్సలో వాడే మందులు అవసరం కంటే ఎక్కువే ఉన్నాయని ఆయన తెలిపారు. డెంగ్యూలో ప్రస్తుతం వచ్చిన స్ట్రెయిన్ తీవ్రంగానే ఉందన్నారు. డెంగీ జ్వరాలకు సరిపడా ఔషధాలు, టెస్ట్ కిట్లు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ కమిషనర్  భాస్కర్ తెలిపారు. 


ఇవి కూడా చదవండిImage Caption