Viral video: ఛీ ఛీ.. ఇదేం హెయిర్ స్టైల్‌రా నాయనా.. హాట్ టాపిక్‌గా మారిన వీడియో..

ABN , First Publish Date - 2022-01-07T03:12:28+05:30 IST

యూపీకి చెందిన ప్రముఖ హెయిర్‌ స్టైలిస్ట్ జావేద్‌ హబీబ్ బ్యూటీ పార్లర్‌కు పూజా గుప్తా అనే యువతి వచ్చింది. అంతరి సమక్షంలో ఆమె కుర్చీలో ఉండగా.. జావెద్ ఆమె జుట్టను దువ్వెనతో సరిచేస్తాడు. ఇంత వరకూ బాగానే ఉన్నా...

Viral video: ఛీ ఛీ.. ఇదేం హెయిర్ స్టైల్‌రా నాయనా.. హాట్ టాపిక్‌గా మారిన వీడియో..

ప్రస్తుత యవత హెయిర్ స్టైల్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. హెయిర్ విభిన్నంగా ఉండేందుకు ఎంత ఖర్చు చేయడానికైనా వెనకాడరు. జుట్టులో చిన్న పాటి మార్పులు వచ్చినా తట్టుకోలేరు. నేటి యువత అభిరుచులకు తగ్గట్టుగా వివిధ రకాల సెలూన్‌లు పుట్టుకొచ్చాయి. వివిధ రకాల ఆకృతుల్లో హెయిర్ కటింగ్ చేస్తూ ఆకట్టుకుంటున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇలాంటి వీడియో ఒకటి వైరల్ అవుతోంది. అయితే అందులోని వ్యక్తి మహిళకు హెయిర్ స్టైలింగ్ చేయడాన్ని నెట్టిజన్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు.


యూపీకి చెందిన ప్రముఖ హెయిర్‌ స్టైలిస్ట్ జావేద్‌ హబీబ్ బ్యూటీ పార్లర్‌కు పూజా గుప్తా అనే యువతి వచ్చింది. అంతరి సమక్షంలో ఆమె కుర్చీలో ఉండగా.. జావెద్ ఆమె జుట్టను దువ్వెనతో సరిచేస్తాడు. ఇంత వరకూ బాగానే ఉన్నా.. ఆ తర్వాతే సమస్య వచ్చి పడింది. హెయిర్ స్టైలింగ్‌లో సూచనలు ఇస్తూనే.. ఉన్నట్టుండి ఆమె జుట్టుపై ఉమ్మి వేస్తాడు. తాను షాంపు వాడనని, ఉమ్మితోనే శుభ్రం చేసుకుంటానని చెబుతూనే ఆమె తలపై రెండు సార్లు ఉమ్మి వేశాడు.

రాత్రి వేళ గ్రామంలోకి చొరబడ్డ సింహం.. అంతా భయపడినా ఓ మహిళ మాత్రం.. చివరకు ఏం తెలిసిందంటే..


తనకు ఎదురైన చేదు అనుభవాన్ని ఆ యువతి.. సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. తలపై ఉమ్మి వేయడం.. తనకు ఏమాత్రం నచ్చలేదంటూ అసంతృప్తి వ్యక్తం చేసింది. దీంతో అతడితో హెయిర్ కట్ చేయించుకోలేదని చెప్పింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు జావేద్‌ను విమర్శిస్తున్నారు. జాతీయ మహిళా కమిషన్‌ కూడా ఈ అంశంపై స్పందించింది. పోలీసులు చర్యలు తీసుకోవాలంటూ మహిళా చైర్‌ పర్సన్‌ రేఖా శర్మ పేర్కొన్నారు.

గుర్రంపై పెళ్లిమంటపానికి చేరుకున్న వరుడు.. రెండో అంతస్థులో వధువు.. కిటికీలోంచి చూసుకుని ఇద్దరి రియాక్షన్‌ను చూస్తే..



Updated Date - 2022-01-07T03:12:28+05:30 IST