ఒత్తైన జుట్టు కోసం..!

ABN , First Publish Date - 2021-06-28T08:06:45+05:30 IST

జుట్టు ఒత్తుగా, పొడవుగా ఉండాలని అందరూ కోరుకుంటారు. కానీ జన్యుకారణాలు, పోషకాహార లోపం, మందుల వల్ల జుట్టు రాలిపోతూ ఉంటుంది.

ఒత్తైన జుట్టు కోసం..!

హెయిర్‌కేర్‌


జుట్టు ఒత్తుగా, పొడవుగా ఉండాలని అందరూ కోరుకుంటారు. కానీ జన్యుకారణాలు, పోషకాహార లోపం, మందుల వల్ల జుట్టు రాలిపోతూ ఉంటుంది. అయితే జుట్టు చక్కగా పెరిగేలా చేసేందుకు కొన్ని హోమ్‌రెమిడీస్‌ ఉపయోగపడతాయి. 


బాదం పలుకుల్లో ప్రొటీన్‌ పుష్కలంగా లభిస్తుంది. విటమిన్లు, జింక్‌ వంటి మినరల్స్‌ సమృద్ధిగా దొరుకుతాయి. ఇవి జుట్టు ఆరోగ్యంగా ఉండడానికి సహాయపడతాయి. బాదంలో ఉండే విటమిన్‌-ఇ కెరటిన్‌ ఉత్పత్తిని పెంచడం ద్వారా దెబ్బతిన్న శిరోజాలను రిపేర్‌ చేస్తుంది. అరటిపండ్లలో కాల్షియం, ఫోలిక్‌యాసిడ్‌ ఉంటుంది. ఇది జుట్టును పట్టులా చేస్తుంది. బాదం, అరటిపండ్లతో స్మూతీ తయారుచేసుకుని తీసుకోవడం వల్ల ఫలితం ఉంటుంది. ఈ స్మూతీలో నట్స్‌, సీడ్స్‌, దాల్చిన చెక్క, తేనె కలుపుకొంటే జుట్టు పెరుగుదలకు అవసరమైన పోషకాలన్నీ లభిస్తాయి.

95 శాతం కెరటిన్‌, 18 రకాల అమైనో యాసిడ్లతో శిరోజాలు తయారవుతాయి. కాబట్టి డైట్‌లో తగినంత ప్రొటీన్‌ లభించేలా చూసుకోవాలి. కోడిగుడ్లు, చికెన్‌, పాలు, ఛీజ్‌, పెరుగు, క్వినోవా లాంటివి డైట్‌లో భాగం చేసుకోవాలి.

 బార్లీ నీళ్లు తాగడం వల్ల కూడా జుట్టు కుదుళ్లు బలోపేతం అవుతాయి. బార్లీ నీళ్లలో ఐరన్‌, కాపర్‌ పుష్కలంగా ఉంటుంది. ఇవి ఎర్రరక్తకణాల ఉత్పత్తిని స్టిమ్యులేట్‌ చేస్తాయి. బార్లీ గింజలను నీళ్లలో మరిగించి, కొద్దిగా ఉప్పు, నిమ్మరసం, తేనె వేసి తీసుకోవాలి.

మెంతుల్లో ఫోలిక్‌యాసిడ్‌, ఎ- విటమిన్‌, కె- విటమిన్‌, సి- విటమిన్‌, పొటాషియం, కాల్షియం, ఐరన్‌ సమృద్ధిగా లభిస్తాయి. ఇవి జుట్టు ఆరోగ్యానికి ఉపకరిస్తాయి. ఒక టీస్పూన్‌ మెంతులను రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయాన్నే ఆ నీటిని తాగాలి. 

Updated Date - 2021-06-28T08:06:45+05:30 IST