జుట్టు నెరవకుండా...!

ABN , First Publish Date - 2020-09-24T06:01:03+05:30 IST

అక్కడక్కడా తెల్లజుట్టు కనిపిస్తే చాలు ఎక్కడ లేని ఆందోళన మొదలవుతుంది. దాంతో తెల్ల జుట్టును నివారించేందుకు రకరకాల ప్రయత్నాలు మొదలుపెడతారు.

జుట్టు నెరవకుండా...!

అక్కడక్కడా తెల్లజుట్టు కనిపిస్తే చాలు ఎక్కడ లేని ఆందోళన మొదలవుతుంది. దాంతో తెల్ల జుట్టును నివారించేందుకు రకరకాల ప్రయత్నాలు మొదలుపెడతారు. కానీ ఈ చిట్కాలు పాటించడం ద్వారా తెల్ల జుట్టు సమస్యను అడ్డుకోవచ్చు. 


కొన్ని బంగాళదుంపలు తీసుకుని వాటి పొట్టు తీయాలి. ఆ పొట్టును ఒక చిన్న పాత్రలో వేసి కాసిన్ని నీళ్లు పోసి చిన్న మంటపై ఉడికించాలి. పదినిమిషాల తరువాత మరో పాత్రలోకి వడకట్టుకోవాలి. ఇందులో రెండు, మూడు చుక్కల శాండల్‌వుడ్‌ ఆయిల్‌ను వేయాలి. తలస్నానం చేసిన తరువాత దాన్ని జుట్టుకు పట్టించాలి. వారంలో రెండు, మూడు రోజులు ఇలా చేస్తే తెల్లజుట్టు సమస్య తగ్గిపోతుంది.


 ఒక కప్పు నీటిలో రెండు టీస్పూన్ల టీ పౌడర్‌ వేసి బాగా మరిగించుకోవాలి. ఈ డికాషన్‌ చల్లారిన తరువాత జుట్టుకు పట్టించాలి. తరువాత షాంపూతో కడగడం లాంటివి చేయకుండా అలాగే వదిలేయాలి. ఇలా చేయడం వల్ల క్రమంగా తెల్లజుట్టు సమస్య తగ్గుతుంది.

Updated Date - 2020-09-24T06:01:03+05:30 IST