జుట్టు రాలుతోంది అనగానే ఆందోళన మొదలవుతుంది. తెలిసిన షాంపూలు, ఇతర ప్రయత్నాలు అన్నీ చేస్తారు. అలాకాకుండా ముందుగా కారణం తెలుసుకునే ప్రయత్నం చేయాలి.
- ఇతర సమస్యలకు మందులు వాడుతున్నట్లయితే ఆ మందుల వల్ల జుట్టు రాలుతూ ఉండవచ్చు. ఒత్తిడి కూడా ఒక కారణమే. జన్యుపరంగా కూడా ఉండవచ్చు. కాబట్టి ముందుగా కారణం తెలుసుకోవాలి.
- పోషకాహారం లోపం కూడా జుట్టు రాలడానికి కారణమవుతుంది. కాబట్టి పండ్లు, చేపలు, కోడిగుడ్లు అధికంగా తీసుకోవాలి. నట్స్ తీసుకుంటే ఫలితం ఉంటుంది.
- కొంతమంది కాస్త తెల్లజుట్టు కనిపించగానే రంగు వేస్తుంటారు. కానీ రంగు కూడా జుట్టు రాలడానికి కారణం కావచ్చు.
- క్యారట్ ఎక్కువగా తీసుకోవాలి. వీలైతే జ్యూస్ రూపంలో తీసుకోవచ్చు. ప్రోటీన్ ఫుడ్ ఎక్కువగా తీసుకుంటే సమస్య తగ్గుముఖం పడుతుంది.