మందారంతో జుట్టు ఆరోగ్యంగా..!

ABN , First Publish Date - 2021-03-14T05:30:00+05:30 IST

జుట్టు రాలుతోందా? వెంట్రుకలు చిట్లిపోతున్నాయా? అయితే మందార పూవులు, ఆకులు తలకు పట్టించండి. మీ సమస్య ఇట్టే దూరమవుతుంది.

మందారంతో జుట్టు ఆరోగ్యంగా..!

జుట్టు రాలుతోందా?  వెంట్రుకలు చిట్లిపోతున్నాయా? అయితే మందార పూవులు, ఆకులు తలకు పట్టించండి. మీ సమస్య ఇట్టే దూరమవుతుంది. 

  • కొన్ని మందారపువ్వులు, కొన్ని మందారచెట్టు ఆకుల్ని తీసుకుని వాటిని శుభ్రంగా నీళ్లతో కడిగి ముద్దలా చేయాలి. ఒక కప్పు కొబ్బరినూనెని వేడిచేసి అందులో ఈ మందార ముద్దను వేసి బాగా కలపాలి. ఈ నూనె వేడి చల్లారాక వడకట్టి ఒక సీసాలో పోసుకుని రోజూ రాత్రి పడుకోబోయేముందు తలకు రాసుకుని మర్నాడు ఉదయం తలస్నానం చేయాలి. 
  • గుప్పెడు మందార ఆకులు, నాలుగు టేబుల్‌స్పూన్ల పెరుగు కలిపి పేస్టులా చేసుకుని దాన్ని తలకు రాసుకోవాలి. గంట తర్వాత షాంపుతో తలంటుకోవాలి. ఇలా తరచూ చేస్తే వెంట్రుకలు నెరవవు. 
  • ఏడెనిమిది మందార పూలను ముద్దలా నూరుకుని దాన్ని తలకు పట్టించుకుని గంట తర్వాత తలస్నానం చేయాలి. ఇది మంచి కండిషనర్‌గా పనిచేస్తుంది. వారంలో ఒకటి రెండు సార్లు ఇలా చేస్తే మీ శిరోజాలు పట్టులా మిలమిలాడతాయి.
  • మూడు చెంచాల ఉసిరి పొడి, రెండు చెంచాల ఉసిరి రసం, గుప్పెడు మందార ఆకుల్ని కలిపి పేస్టులా చేసుకొని దాన్ని తలంతా పట్టించుకుని 45 నిమిషాలు అలాగే ఉంచుకోవాలి. ఆ తర్వాత చల్లటి నీళ్లతో కడిగేసుకోవాలి. ఇలా చేస్తే జుట్టు చివర్లు చిట్లకుండా ఉంటాయి. 

Read more