నాలుకపై పెరుగుతున్న వెంట్రుకలు.. షాకింగ్ కారణం బయటపెట్టిన వైద్యులు!

ABN , First Publish Date - 2022-03-12T22:34:58+05:30 IST

కొన్నిసార్లు చిత్రమైన ఆరోగ్య సమస్యలు వెలుగులోకి మనల్ని ఆశ్చర్యానికి గురి చేస్తుంటాయి.

నాలుకపై పెరుగుతున్న వెంట్రుకలు.. షాకింగ్ కారణం బయటపెట్టిన వైద్యులు!

కొన్నిసార్లు చిత్రమైన ఆరోగ్య సమస్యలు వెలుగులోకి వచ్చి మనల్ని ఆశ్చర్యానికి గురి చేస్తుంటాయి. సాధారణ ప్రజలే కాదు.. వైద్యులు కూడా ఆ సమస్య వెనుక ఉన్న కారణం గురించి ఆయోమయానికి గురవుతుంటారు. తాజాగా కేరళకు చెందిన ఓ వ్యక్తికి నాలుకపై వెంట్రుకలు పెరగడం సంచలనంగా మారింది. దీంతో అతను డెర్మటాలజిస్ట్‌ను సంప్రదించాడు. అతడిని పరీక్షించిన వైద్య బృందం ఆ సమస్యను వైద్యపరంగా `లింగువా విల్లోసా నిగ్రా`గా తేల్చింది. 


50 ఏళ్ల బాధిత వ్యక్తికి కొద్ది రోజుల క్రితం బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. దీంతో అతనికి ఆహారం నమలడం కష్టంగా మారింది. దీంతో వైద్యుల సూచన మేరకు అతను `ఆల్-లిక్విడ్ డైట్‌` ఫాలో అవుతున్నాడు. ఈ క్రమంలో ఆ వ్యక్తి నాలుక అకస్మాత్తుగా నల్లగా మారిపోయింది. అతను తీసుకునే డైట్‌కు సంబంధించిన పదార్ధాల వల్ల నాలుకపై నలుపు, పసుపు మచ్చలు ఏర్పడినట్లు వైద్యులు తెలిపారు. వైద్యులు అతని నాలుకను శుభ్రం చేసి వెంట్రుక లాంటి పొరను తొలిగించారు. నోటి అపరిశుభ్రత, ఎక్కువగా మెత్తని ఆహారాలు తినేవారిలో ఈ సమస్య కనబడుతుందట.  

Updated Date - 2022-03-12T22:34:58+05:30 IST