తలకు రాసుకునే నూనెల కన్నా.. అలా చేస్తేనే జుట్టు ఒత్తుగా పెరుగుతుంది..

ABN , First Publish Date - 2021-12-11T23:40:37+05:30 IST

నాకు పదిహేడేళ్లు. ఈ మధ్య జుట్టు బాగా రాలుతోంది. తరుణోపాయం చెప్పండి.

తలకు రాసుకునే నూనెల కన్నా.. అలా చేస్తేనే జుట్టు ఒత్తుగా పెరుగుతుంది..

ఆంధ్రజ్యోతి(11-12-2021)

ప్రశ్న: నాకు పదిహేడేళ్లు. ఈ మధ్య జుట్టు బాగా రాలుతోంది. తరుణోపాయం చెప్పండి.


- వినూత్న, హన్మకొండ


డాక్టర్ సమాధానం: మీ జుట్టు రాలే సమస్యకు పరిష్కారం తలపైన రాసుకునే నూనెల కన్నా మీరు తీసుకునే ఆహారం నుండే అధికంగా లభిస్తుంది. జుట్టు ఆరోగ్యంగా ఉండడానికి ప్రొటీన్లు ఎంతో అవసరం. ప్రొటీన్లు ఎక్కువగా ఉండే చికెన్‌, చేప, గుడ్లు లాంటి మాంసాహారంతో పాటు పాలు, పెరుగు, పప్పుధాన్యాలు ఎక్కువగా తీసుకుంటే మంచిది. వీటిని రోజులో ఒకసారి తప్పని సరిగా తీసుకోవాలి. ప్రొటీన్లతో పాటు ఐరన్‌, జింక్‌, సెలీనియం మొదలైన ఖనిజాలు పుష్కలంగా ఉన్న ఆహారం తీసుకోవాలి. దీని కోసం చికెన్‌, మటన్‌, చేప, రొయ్యలు, గుడ్లు మొదలైన మాంసాహారంతో పాటు కందులు, పెసలు, మినుములు లాంటి పప్పుధాన్యాలు; బాదం, పిస్తా, వాల్‌ నట్స్‌, అవిసె గింజలను కూడా మీ ఆహారంలో భాగంగా చేసుకోండి. వీటన్నిటి వల్ల ఒమేగా 3 ఫాటీయాసిడ్లు కొంత వరకు లభిస్తాయి. విటమిన్‌ - డి తక్కువగా ఉన్నా సరే జుట్టురాలే సమస్య వస్తుంది. ఒక వేళ విటమిన్‌ - డి లోపం ఉంటే  వైద్యుల సలహా మేరకు సప్లిమెంట్స్‌ వాడవచ్చు. రోజూ ఇరవైనిమిషాల పాటు ఎండలో సమయం గడపడం వల్ల కూడా కొంత విటమిన్‌ డిని పొందవచ్చు. నిద్రలేమి సమస్య కూడా జుట్టురాలడానికి కారణం. ఒక వేళ అధిక బరువు వల్ల థైరాయిడ్‌ సమస్య ఉన్నట్టయితే  బరువు పెరగడం నియంత్రణలోకి వస్తే జుట్టు రాలడం కొంత తగ్గుతుంది. 


డా. లహరి సూరపనేని

న్యూట్రిషనిస్ట్, వెల్‌నెస్ కన్సల్టెంట్

nutrifulyou.com(పాఠకులు తమ సందేహాలను

sunday.aj@gmail.coomకు పంపవచ్చు)

Updated Date - 2021-12-11T23:40:37+05:30 IST