జుట్టు ఊడకుండా, తెల్లబడకుండా ఉండాలంటే..

ABN , First Publish Date - 2020-05-04T18:00:30+05:30 IST

నాకు ఇరవై నాలుగేళ్లు. గత మూడు నెలలుగా జుట్టు ఊడడం ఎక్కువైంది. తెల్ల వెంట్రుకలు కూడా వస్తున్నాయి. చక్కటి ఆహార నియమాలు చెప్పగలరు

జుట్టు ఊడకుండా, తెల్లబడకుండా ఉండాలంటే..

ఆంధ్రజ్యోతి(04-05-2020):

ప్రశ్న: నాకు ఇరవై నాలుగేళ్లు. గత మూడు నెలలుగా జుట్టు ఊడడం ఎక్కువైంది. తెల్ల వెంట్రుకలు కూడా వస్తున్నాయి. చక్కటి ఆహార నియమాలు చెప్పగలరు?

- ఝాన్సీ రాణి, శ్రీకాకుళం 

డాక్టర్ సమాధానం: జుట్టు ఆరోగ్యంగా ఉండడానికి ప్రొటీన్లు ఎంతో అవసరం. ప్రొటీన్లు ఎక్కువగా ఉన్న చికెన్‌, చేప, గుడ్లు లాంటి మాంసాహారంతో పాటు పాలు, పెరుగు, పప్పు ధాన్యాలు తీసుకుంటే మంచిది. కేవలం ప్రొటీన్లు మాత్రమే కాకుండా ఐరన్‌, జింక్‌, సెలీనియం మొదలైన ఖనిజాలు పుష్కలంగా ఉన్న ఆహారం తీసుకోవడం మేలు. వీటికోసం  మాంసాహారంతో పాటు కందులు, పెసలు, మినుములు; బాదం, పిస్తా, వాల్నట్స్‌, అవిసె గింజలు కూడా ఆహారంలో భాగం చేసుకోండి. వీటి వల్ల ఆరోగ్యకరమైన జుట్టుకు అవసరమైన ఒమేగా 3 ఫాటీ యాసిడ్లు కొంత వరకు లభిస్తాయి. విటమిన్‌ - డి తక్కువగా ఉన్నా సరే జుట్టు రాలుతుంది. ఒకవేళ విటమిన్‌ - డి చాలా తక్కువగా ఉంటే వైద్యుల సలహా మేరకు సప్లిమెంట్స్‌ వాడొచ్చు. 

లేదా రోజూ ఇరవై నిమిషాలు ఎండలో గడిపి విటమిన్‌ - డి పొందవచ్చు. నిద్రలేమి కూడా జుట్టు రాలడానికి కారణం. నిద్ర సమయానికి కనీసం రెండు గంటల ముందుగా ఆహారం తీసుకోవడం, కనీసం గంట ముందుగా ఫోను, టీవీ తదితర ఎలకా్ట్రనిక్‌ పరికరాలను ఆపివేయడం మంచిది. రోజూ కనీసం ఏడు గంటలైనా నిద్ర పోవాలి. ఆందోళన లేని జీవితం జుట్టు రాలే సమస్యను అరికడుతుంది. దీనికి తగిన వ్యాయామం అవసరం.

Updated Date - 2020-05-04T18:00:30+05:30 IST