కురుల పరిమళం కోసం

ABN , First Publish Date - 2020-07-04T18:59:35+05:30 IST

శరీరం రోజంతా తాజాగా, పరిమళభరతంగా ఉండేందుకు పర్‌ఫ్యూమ్‌ వాడుతాం. చెమట వల్ల శరీరమే కాదు మాడు భాగం దురద పుట్టి, జుట్టంతా చెడు వాసన వస్తుంది. ఇంటి వద్ద తయారు చేసుకున్న స్ర్పేతో కేశాలను సువాసనతో తాజాగా మార్చుకోండిలా...

కురుల పరిమళం కోసం

ఆంధ్రజ్యోతి(04-07-2020)

శరీరం రోజంతా తాజాగా, పరిమళభరతంగా ఉండేందుకు పర్‌ఫ్యూమ్‌ వాడుతాం. చెమట వల్ల శరీరమే కాదు మాడు భాగం దురద పుట్టి, జుట్టంతా చెడు వాసన వస్తుంది. ఇంటి వద్ద తయారు చేసుకున్న స్ర్పేతో కేశాలను సువాసనతో తాజాగా మార్చుకోండిలా...

కావలసినవి: సగం కప్పు రోజ్‌ వాటర్‌, కొన్ని చుక్కల వెనీలా ఎక్ట్సాక్ట్‌, 10-15 చుక్కల జాస్మిన్‌ నూనె, కొన్ని చుక్కల స్వీట్‌ ఆరెంజ్‌ నూనె.

తయారీ:  ఒక గిన్నెలో రోజ్‌ వాటర్‌, వెనీలా ఎక్ట్సాక్ట్‌, జాస్మిన్‌ నూనె, స్వీట్‌ ఆరెంజ్‌ నూనె తీసుకొని బాగా కలపాలి. ఈ ద్రావణాన్ని స్ర్పే బాటిల్‌లో పోయాలి. అంతే హెయిర్‌ పర్‌ఫ్యూమ్‌ రెడీ. ఇప్పుడు స్ర్పే బాటిల్‌ను షేక్‌ చేయాలి. తరువాత ఆ బాటిల్‌ను పొడి ప్రదేశంలో ఉంచాలి. 

ఈ పర్‌ఫ్యూమ్‌ను తలస్నానం చేసిన తరువాత లేదా తలంటు చేయకున్నా వెంట్రుకలపై స్ర్పే చేసుకోవచ్చు. జుట్టు తాజాదనం, మెరుపు కోల్పోయినట్టు అనిపిస్తే ఈ హెయిర్‌ పర్‌ఫ్యూమ్‌ ఉపయోగించి చూడండి.

Updated Date - 2020-07-04T18:59:35+05:30 IST