వడగండ్ల వాన బీభత్సం

ABN , First Publish Date - 2021-04-21T06:53:43+05:30 IST

దేవరకొండ డివిజన్‌లో మంగళవారం సాయంత్రం వడగండ్ల వాన బీభత్సం సృష్టించింది. భారీ వర్షంతో ఒక్క దేవరకొండ, డిండి మండలాల్లో 350 ఎకరాల్లో పంటనష్టం వాటిల్లింది. డివిజన్‌లో యాసంగి సీజన్‌లో లక్షన్నర ఎకరాల్లో రైతులు వరి సాగుచేశారు. ఏఎమ్మార్పీ ఆయకట్టు, డిండి మండలాల్లో అత్యధికంగా, దేవరకొండ మండలంలో బోరుబావుల కింద 6వేల ఎకరా ల్లో వరి సాగైంది.

వడగండ్ల వాన బీభత్సం
చింతపల్లి మండలం కుర్మేడు గ్రామంలో విరిగిపడిన విద్యుత్‌ స్థంభాలు

దేవరకొండ డివిజన్‌లో పంటనష్టపోయిన రైతులు

ఈదురు గాలులతో ఎగిరిపోయిన ఇంటిపైకప్పులు

విరిగిన విద్యుత్‌ స్తంభాలు


దేవరకొండ, చింతపల్లి, డిండి, మర్రిగూడ, ఏప్రిల్‌ 20: దేవరకొండ డివిజన్‌లో మంగళవారం సాయంత్రం వడగండ్ల వాన బీభత్సం సృష్టించింది. భారీ వర్షంతో ఒక్క దేవరకొండ, డిండి మండలాల్లో 350 ఎకరాల్లో పంటనష్టం వాటిల్లింది. డివిజన్‌లో యాసంగి సీజన్‌లో లక్షన్నర ఎకరాల్లో రైతులు వరి సాగుచేశారు. ఏఎమ్మార్పీ ఆయకట్టు, డిండి మండలాల్లో అత్యధికంగా, దేవరకొండ మండలంలో బోరుబావుల కింద 6వేల ఎకరా ల్లో వరి సాగైంది. పంటచేతికొచ్చే సమయంలో మం గళవారం సాయత్రం వడగండ్ల వాన కురవడం తో దేవరకొండ, డిండి మండలాల్లో 350 ఎకరా ల్లో వరిపంటకు నష్టం వాటిల్లినట్టు వ్యవసాయ అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. వడగండ్ల వర్షానికి దేవరకొండ మండలంలో 200 ఎకరాల్లో వరి, రేగళ్లతండా, తెలుగుపల్లి, తాటికోలు, వైదోనివంపు, డిండి మండలం కామేపల్లి, గౌరారంలో 150 ఎకరాల వరకు వరికి నష్టం వాటిల్లింది. ఎకరాకు రూ.20వేల చొప్పున పెట్టుబడులు పెట్టామని, అకాల వర్షానికి పూర్తిగా నష్టపోయామని దేవరకొండ మండలం రేగళ్లతండాకు చెందిన రైతులు రవి, కవిత ఆవేదన వ్యక్తం చేశారు. నష్టపోయిన పంటనుచూసి వారు బోరుమన్నారు. అప్పు చేసి బోరుబావి కింద ఐదెకరాలు వరిసాగుచేశానని, వర్షంతో పంట నేలవాలి అప్పులే మిగిలాయ ని రైతు రమావత్‌ మోతిలాల్‌ ఆవేదన వ్యక్తం చేశాడు. చిం తపల్లి మండలంలో వీటీనగర్‌, గొడుకొండ్ల, మధనాపురం, కుర్మేడు, చింతపల్లి తదితర గ్రామాలలో సుమారు రెండు గంటలపాటు ఈదురుగాలులు, వడగండ్లతో కూడిన వర్షం కురిసింది. దీంతో భారీగా పంటనష్టం వాటిల్లింది. కుర్మేడు గ్రామంలో ఈదురుగాలులతో విద్యుత్‌ స్తంభాలు విరిగాయి. పిడుగుపాటుకు గజ్జె మల్లేష్‌ రైతుకు చెందిన ఎద్దు మృతి చెందింది. డిండి మండలంలో వడగండ్లవాన బీభత్సం సృష్టించింది. కామేపల్లి, కె.గౌరారం, టి.గౌరారం, డి.నెమలిపూర్‌, ప్రతా్‌పనగర్‌, ఖానాపూర్‌, నిజాంనగర్‌, గోనబోయినపల్లి గ్రామాల్లో వడగండ్లవాన, ఈదురుగాలులకు ఇంటిరేకులు లేచిపోయాయి. గాలి ఉధృతికి చెట్లు నేలవాలాయి. మర్రిగూడ మండలంలో అకాల వర్షం, ఈదురుగాలులతో చర్లగూడెం గ్రామంలో ఇంటిపైకప్పు రేకులు లేచిపోయాయి. ఎరుగండ్లపల్లి, రాజుపేటతండా ఎక్స్‌రోడ్డు వద్ద విద్యుత్‌ స్తంభాలు కూలాయి. తమడపల్లి, తిరుగండ్లపల్లి, అజలాపురం, ఎరుగండ్లపల్లి, రాజుపేటతండా, చర్లగూడం, మర్రిగూడలో ఈదురుగాలులతో ఆస్తినష్టం వాటిల్లింది.


రైతులకు పరిహారం ఇవ్వాలి: పల్లా నర్సింహారెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు

దేవరకొండ, డిండి మండలాల్లో అకాల వర్షానికి వరిపంటకు నష్టం వాటిల్లింది. అధికారులు పంట నష్టంపై అంచనావేసి రైతులకు ఎకరాకు రూ.50వేల చొప్పున పరిహారం ఇవ్వాలి. రైతులు అప్పుచేసి బోరుబావుల కింద వరి సాగుచేశారు. పంటచేతికొచ్చే సమయంలో అకాల వర్షంతో నష్టం జరగడం బాధాకరం.


Updated Date - 2021-04-21T06:53:43+05:30 IST