భారత్‌ మాతాకీ జై...

ABN , First Publish Date - 2022-08-14T04:25:06+05:30 IST

ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ వేడుకల్లో భాగంగా రాయచోటి పట్టణంలోని జూనియర్‌ కాలేజీ మైదానంలో శనివారం విద్యార్థులు భారతదేశ చిత్రపటం ఆకారంలో నిలబడ్డారు.

భారత్‌ మాతాకీ జై...
భారతదేశ చిత్రపటం ఆకారంలో మహిళలు

దేశ చిత్రపటం ఆకారంలో విద్యార్థులు.. 


రాయచోటి (కలెక్టరేట్‌ ), ఆగస్టు 13: ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ వేడుకల్లో భాగంగా రాయచోటి పట్టణంలోని జూనియర్‌ కాలేజీ మైదానంలో శనివారం విద్యార్థులు భారతదేశ చిత్రపటం ఆకారంలో నిలబడ్డారు. మహిళలు ఉప్పు, కంకరతో రంగోలితో కూడిన తీర్చిదిద్దిన జాతీయ జెండా అందరినీ ఆకర్షిస్తోంది. రంగోలి పోటీల్లో భాగంగా భారతదేశ చిత్రపటంలో జాతీయ జెండాను తయారు చేసి తమ ప్రతిభను చాటుకున్నారు. వెలుగు సిబ్బంది, జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల విద్యార్థులు భారతదేశ చిత్రపటం ఆకారంలో నిలబడి జాతీయ జెండాను చేత పట్టుకొని బోలో మాతాకీ జై, మేరా భారత్‌ మహాన్‌, వందేమాతరం వంటి నినాదాలు చేస్తూ దేశం పట్ల తమకు ఉన్న జాతీయభావాన్ని చాటారు. కార్యక్రమంలో డీఆర్‌డీఏ పీడీ సత్యనారాయణ, భూముల సర్వే విభాగం సహాయ సంచాలకులు జయరాజ్‌, పీఆర్‌టీయూ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర నాయకులు శ్రీనివాసరాజు, వెలుగు సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-14T04:25:06+05:30 IST