నిజామాబాద్ జిల్లాలో వడగళ్ల వాన

ABN , First Publish Date - 2021-04-14T01:40:08+05:30 IST

జిల్లాలో అకాల వర్షం కురిసింది. కొన్ని ప్రాంతాల్లో వడగళ్ల వాన పడింది.

నిజామాబాద్ జిల్లాలో వడగళ్ల వాన

నిజామాబాద్: జిల్లాలో అకాల వర్షం కురిసింది. కొన్ని ప్రాంతాల్లో వడగళ్ల వాన పడింది. బోధన్, ఎడపల్లి, వర్నీ, జక్రాన్‌పల్లి, దర్పల్లి, నవీపేట మండలాల్లో వడగళ్ల వాన పడింది. ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. వరి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. కొనుగోలు కేంద్రాలలో ధాన్యం తడిసింది. 

Updated Date - 2021-04-14T01:40:08+05:30 IST