Abn logo
Oct 23 2021 @ 00:00AM

కంబదూరులో వడగండ్ల వాన

అనంతపురం వ్యవసాయం, అక్టోబరు 23: కంబదూరుతోపాటు ఆ మండలంలోని కదిరిదేవరపల్లి, చెర్లోపల్లి, గొల్లపల్లి ప్రాంతాల్లో శనివా రం వడగండ్ల వాన కురిసింది. జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. బెళుగుప్ప, ముదిగుబ్బ, బత్తలపల్లి, యల్లనూరు, తాడిమర్రి మండలాల్లో వాన పడింది. గోరంట్ల, నం బులపూలకుంట, చిలమత్తూరు, కుందుర్పి, బుక్కపట్నం, ఉరవకొండ, యాడికి, పుట్లూరు, శింగనమల, నార్పల, హిందూపురం ప్రాంతాల్లో ఓ మోస్తారు వర్షం కురిసింది. పుట్టపర్తి, గార్లదిన్నె, గుత్తి, శెట్టూరు తదితర మండలాల్లో చిరుజల్లులు పడ్డాయి. శుక్రవారం జిల్లావ్యాప్తంగా 17 మండలాల్లో చిరుజల్లుల నుంచి ఓ మోస్తారు వర్షం పడింది. ముది గుబ్బ మండలంలోని యోగివేమన జలాశయంలోకి వరద పెరగడంతో రెండు గేట్లు ఎత్తి, 500 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు.