హఫీజ్ తనయుడిని ఉగ్రవాదిగా ప్రకటించిన ఇండియా

ABN , First Publish Date - 2022-04-10T02:25:58+05:30 IST

ముంబై వరుస పేలుళ్ల ప్రధాన సూత్రధారి హఫీజ్ సయీద్ కుమారుడైన హఫిజ్ తల్హా సయీద్‌ను..

హఫీజ్ తనయుడిని ఉగ్రవాదిగా ప్రకటించిన ఇండియా

న్యూఢిల్లీ: ముంబై వరుస పేలుళ్ల ప్రధాన సూత్రధారి హఫీజ్ సయీద్ కుమారుడైన హఫిజ్ తల్హా సయీద్‌ను డిజిగ్నేటెడ్ టెర్రరిస్టుగా ఇండియా ప్రకటించింది. చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం-1967లోని నిబంధనల కింద తల్హా సయీద్‌ పేరును డిజిగ్నేటెడ్ టెర్రరిస్టులో జాబితాలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ (ఎంహెచ్ఏ) చేర్చింది.


లష్కరే తొయిబా (ఎల్ఈటీ) సంస్థ సీనియర్ నేతగానూ, ఆ సంస్థ క్లెరిక్ విభాగం అధిపతిగాను తల్హా సయీద్ ఉన్నాడు. ఉగ్రవాదుల రిక్రూట్‌మెంట్, నిధుల వసూళ్లు, ఇండియాలో దాడులకు వ్యూహరచన, వాటి అమలుతో పాటు ఆప్ఘనిస్థాన్‌లో భారత్ ప్రయోజనాలను దెబ్బతీసే కార్యక్రమాల్లోనూ తల్హా చురుకుగా వ్యవహరిస్తున్నాడని ఎంహెచ్ఏ నోటిఫికేషన్ పేర్కొంది. నిషేధిత జమాత్ ఉద్ దవా చీఫ్‌గా ఉన్న హఫీజ్ సయీద్‌కు పాకిస్థాన్ టెర్రరిస్టు నిరోధక కోర్టు శుక్రవారంనాడు రెండు కేసుల్లో 31 ఏళ్ల జైలు శిక్ష విధించిన నేపథ్యంలో అతని కుమారుడైన తల్హాను డిజిగ్నేటెడ్ టెర్రరిస్టుగా ఇండియా ప్రకటించడం ప్రాధాన్యం సంతరించుకుంది.

Updated Date - 2022-04-10T02:25:58+05:30 IST