బెంగాల్ ప్రత్యేక దేశం అయ్యుంటే శ్రీలంకలాగే ఉండేది: బీజేపీ చీఫ్

ABN , First Publish Date - 2022-04-05T23:45:47+05:30 IST

మమతా బెనర్జీ ముందు బెంగాల్‌ను సరిగా చూసుకోవాలి. శ్రీలంక పూర్తిగా ధ్వంసమైంది. అది చాలా తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కుంటోంది. అయితే బెంగాల్ కూడా అలా కావొద్దంటే మమతా రాష్ట్రంపై శ్రద్ధ వహించాలి. నిజానికి శ్రీలంక అప్పులు 6 లక్షల కోట్ల..

బెంగాల్ ప్రత్యేక దేశం అయ్యుంటే శ్రీలంకలాగే ఉండేది: బీజేపీ చీఫ్

కోల్‌కతా: శ్రీలంక ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభాన్ని భారత్ కూడా ఎదుర్కోవచ్చంటూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలపై భారతీయ జనతా పార్టీ మండిపడింది. ఆమె ముందు రాష్ట్రంపై దృష్టి పెట్టాలని, రాష్ట్రంలోని పరిస్థితులపై ఆలోచించాలేని పశ్చిమ బెంగాల్ బీజేపీ అధినేత సుకంత మజుందర్ అన్నారు. మంగళవారం కో‌ల్‌కతాలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఒకవేళ బెంగాల్ ప్రత్యేక దేశంగా ఉండుంటే శ్రీలంక కంటే దారుణమైన పరిస్థితిని ఎదుర్కునేదని ఆయన అన్నారు.


‘‘మమతా బెనర్జీ ముందు బెంగాల్‌ను సరిగా చూసుకోవాలి. శ్రీలంక పూర్తిగా ధ్వంసమైంది. అది చాలా తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కుంటోంది. అయితే బెంగాల్ కూడా అలా కావొద్దంటే మమతా రాష్ట్రంపై శ్రద్ధ వహించాలి. నిజానికి శ్రీలంక అప్పులు 6 లక్షల కోట్ల రూపాయలు. బెంగాల్ అప్పుడు కూడా అటుఇటుగా ఇంతే. ప్రస్తుతం బెంగాల్ అప్పులు 5.62 లక్షల కోట్ల రూపాయలు. ఒకవేళ బెంగాల్ ప్రత్యేక దేశంగా ఉండి ఉంటే శ్రీలంక లాంటి సంక్షోభాన్నే ఎదుర్కునేది. అంతకంటే ఎక్కువే ఉండేది కావొచ్చు’’ అని సుకంత మజుందర్ అన్నారు.

Updated Date - 2022-04-05T23:45:47+05:30 IST